Site icon HashtagU Telugu

Madhumurthy : ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా మధుమూర్తి

Appointed Madhumurthy as Chairman of AP Higher Education Council..

Appointed Madhumurthy as Chairman of AP Higher Education Council..

Madhumurthy : ఏపీ ఉన్న‌త విద్యామండ‌లి ఛైర్మ‌న్‌గా మ‌ధుమూర్తి నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు విద్యా శాఖ కార్య‌ద‌ర్శి కోన శ‌శిధ‌ర్ శ‌నివారం ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ ప‌ద‌విలో ఆయన మూడేళ్ల‌పాటు కొన‌సాగ‌నున్నారు. ప్రొఫెస‌ర్ మ‌ధుమూర్తి ప్ర‌స్తుతం వ‌రంగ‌ల్ ఎన్ఐటీ బోర్డ్ ఆఫ్ గ‌వ‌ర్న‌ర్స్ స‌భ్యుడిగా ఉన్నారు.

ఇక ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే రోజు ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ఉన్న హేమచంద్రారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఈ చైర్మన్‌ పదవి ఖాళీగానే ఉంది. వైస్‌ చైర్మన్‌ రామ్మోహన్‌ రావునే ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో మధుమూర్తిని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, విద్యామండలి చైర్మన్‌గా నియమితులైన మధుమూర్తి స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి మండలం జాగర్లమూడి గ్రామం. విశాఖలో ఆయన విద్యాభ్యాసం పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన తెలంగాణలోని హనుమకొండలో నివాసం ఉంటున్నారు.

Read Also: Manchu Family Controversy: మంచు మనోజ్ కు సివిల్ కోర్టు షాక్?