Site icon HashtagU Telugu

YS Sharmila : తక్షణమే APPSC చైర్మన్‌ను నియమించండి : వైఎస్ షర్మిల

Appoint APPSC Chairman immediately : YS Sharmila

Appoint APPSC Chairman immediately : YS Sharmila

APPSC Chairman: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూటమి సర్కారు విమర్శలు గుప్పించారు. APPSCపై కూటమి సర్కారు నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుందన్నారు. ఒక రాజ్యాంగబద్ధ సంస్థకు నాలుగు నెలలుగా చైర్మన్ లేకపోవడం సిగ్గుచేటని మడిపడ్డారు. దేశ చరిత్రలో ఇది తొలిసారని అన్నారు.

Read Also: YS Jagan: మేము గుడ్ బుక్ రాసుకోవడం ప్రారంభించాం – వైఎస్ జగన్

మీ ప్రక్షాళన రాజకీయాలకు నిరుద్యోగులను బలి చేస్తున్నారని దుయ్యబట్టారు. శ్వేతపత్రాల మీద పెట్టిన శ్రద్ధ.. కమీషన్ బలోపేతంపై పెట్టలేదన్నారు షర్మిల. చైర్మన్ నియామకం జరగక కొత్త నోటిఫికేషన్లు లేవని.. విడుదలైన వాటికి పరీక్షల నిర్వహణ లేదన్నారు. వాయిదా వేసిన గ్రూప్ 1, గ్రూప్ 2, లాంటి పరీక్షలను మళ్ళీ ఎప్పుడు పెడతారో తెలియదన్నారు. APPSC పరిధిలో 21 రకాల పరీక్షలు పెండింగ్ పడ్డాయంటే ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుందన్నారు.

రాష్ట్రంలోని నిరుద్యోగుల పక్షాన ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని డిమాండ్ చేస్తున్నామని.. తక్షణం APPSC చైర్మన్ ను నియమించాలాన్నారు. అనంతరం వాయిదా వేసిన పరీక్షలతో పాటు, విడుదలైన నోటిఫికేషన్లకు షెడ్యూల్ ప్రకటన చేయించారన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉండి, కమీషన్ భర్తీ చేయాల్సిన ఒక లక్ష పోస్టులకు కొత్తగా అనుమతి ఇవ్వాలని, ఆందోళనలో ఉన్న నిరుద్యోగులకు న్యాయం జరిగేలా చూడాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు షర్మిల.

Read Also: Shilpa Shetty : బాంబే హైకోర్టును ఆశ్రయించిన శిల్పాశెట్టి దంపతులు