AIIMS Mangalagiri : మంత్లీ శాలరీ 2 లక్షలకుపైనే.. మంగళగిరి ఎయిమ్స్‌లో జాబ్స్

AIIMS Mangalagiri : ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎయిమ్స్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి.

  • Written By:
  • Updated On - January 13, 2024 / 04:13 PM IST

AIIMS Mangalagiri : ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎయిమ్స్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఎయిమ్స్‌లో మెడికల్ సూపరింటెండెంట్, రిజిస్ట్రార్, నర్సింగ్ సూపరింటెండెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులను దీని ద్వారా భర్తీ చేయనున్నారు. ఇంటర్య్వూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు మంచి జీతభత్యాలు ఉంటాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 4లోగా మంగళగిరి ఎయిమ్స్(AIIMS Mangalagiri) అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు.  మూడేళ్ల కాలానికి కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 56 సంవత్సరాలుగా నిర్ణయించారు.

భారీగా జీతాలు..

మెడికల్ సూపరింటెండెంట్‌ పోస్టుకు ఎంపికయ్యే వారికి నెలవారీ జీతం  రూ.1,44,200 నుంచి రూ.2,18,200 దాకా ఇస్తారు. రిజిస్ట్రార్ పోస్టుకు ఎంపికయ్యే వారికి రూ. 78,800 నుంచి రూ. 2,09,200 వరకు  శాలరీ ఉంటుంది. నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టుకు ఎంపికయ్యే వారికి నెలకు రూ. 67,700 నుంచి రూ.2,08,700 దాకా ఇస్తారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుకు ఎంపికయ్యే వారికి నెలకు రూ. 56,100 నుంచి రూ.1,77,500 వరకు జీతం ఇస్తారు.  అభ్యర్థులు దరఖాస్తు ఫామ్‌ను చివరి తేదీకి(ఫిబ్రవరి 4) ముందుగా మంగళగిరి ఎయిమ్స్ చిరునామాకు కూడా పంపొచ్చు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఒప్పంద ప్రాతిపదికన 125 టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వీటిలో 73 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 22 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 20 ప్రొఫెసర్ పోస్టులు, 10 అడిషనల్‌ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. మెడికల్ పీజీ, ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉన్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 29 వరకు అప్లై చేయొచ్చు. జనరల్ అభ్యర్థులు రూ.3,100, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు రూ.2,100, దివ్యాంగులు రూ.100 అప్లికేషన్ ఫీజు కట్టాలి. ఆన్‌లైన్ దరఖాస్తుకు లాస్ట్ డేట్ జనవరి 29. దరఖాస్తుల హార్డ్ కాపీలను ఫిబ్రవరి 8లోగా మంగళగిరి ఎయిమ్స్ అడ్రస్ కు పంపించాలి.

Also Read: Trading Accounts : డీమ్యాట్ అకౌంట్లలో ఏటీఎం కార్డులాంటి ఫీచర్.. వివరాలివీ

ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. తమ కంపెనీలోని వివిధ విభాగాల్లో ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లను నియమించుకునేందుకు గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ ట్రైనీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా పెట్రో కెమికల్ నుంచి న్యూ ఎనర్జీ వరకు రిలయన్స్‌కు చెందిన వివిధ వ్యాపార విభాగాల్లో ఉద్యోగావకాశాలను కల్పించనుంది. ఈ సదావకాశాన్ని ఇంజినీరింగ్‌ విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని రిలయన్స్‌ సూచించింది. ఇందుకోసం ఓ వెబ్‌సైట్‌ను (https://relianceget2024.in/) సైతం రిలయన్స్ అందుబాటులో ఉంచింది. అందులో అర్హత, నియామక ప్రక్రియ, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ వివరాలను అందులో పొందుపరిచింది. అభ్యర్థులు 10, 12, డిప్లొమాలో 60 శాతం మార్కులు లేదా 6 CGPA  సాధించి ఉండాలి. ఇంజినీరింగ్‌లో 60 శాతం (ఏడో సెమిస్టర్‌/ గ్రాడ్యుయేషన్‌) మార్కులు సాధించిన వారు అర్హులు.