BEd Fee Refund : బీఈడీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రీఫండ్ ఇలా..

BEd Fee Refund : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) పోస్టులకు B.Ed చదివిన వారు కూడా అర్హులని ప్రకటించారు.

  • Written By:
  • Publish Date - February 24, 2024 / 10:06 AM IST

BEd Fee Refund : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) పోస్టులకు B.Ed చదివిన వారు కూడా అర్హులని ప్రకటించారు. అయితే దీనిపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో.. SGT పోస్టులకు బీఈడీ చేసినవారు అనర్హులని తీర్పు వచ్చింది. ఈమేరకు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం ఉదహరించింది.  ఈనేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్జీటీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న బీఈడీ అభ్యర్థులందరికీ ఫీజును రీఫండ్ చేస్తామని ప్రకటించింది. అభ్యర్థుల ఆధార్‌ నంబర్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేస్తామని ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. దీనికి సంబంధించిన హెల్ప్‌ డెస్క్‌ నెంబర్లు 95056 19127, 97056 55349, 81219 47387, 81250 46997.

We’re now on WhatsApp. Click to Join

రాష్ట్రవ్యాప్తంగా 120 కేంద్రాలు

ఏపీ టెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న 2.67 లక్షల మంది హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. టెట్‌ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 120 కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఎస్జీటీ అభ్యర్థుల్లో 76.5 శాతం మందికి వారు ఎంపిక చేసుకున్న మొదటి ప్రాధాన్య కేంద్రాన్నే కేటాయించారు. ‘టెట్’ పరీక్ష కేంద్రాల గురించి సందేహాలున్నవారు వారివారి జిల్లాల విద్యాశాఖ అధికారుల కార్యాలయాలను సంప్రదించవచ్చు.అభ్యర్థుల సౌకర్యార్థం టెట్‌, డీఎస్సీ (BEd Fee Refund) కోసం హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు.

Also Read : Gmail : 2024 ఆగస్టులో జీమెయిల్ బంద్ ? నిజమేనా ?

వెబ్‌సైట్‌లో టెట్ హాల్‌టికెట్లు..

ఏపీలో టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ పరీక్ష అభ్యర్థులు తమ ఐడీ నెంబరు, పుట్టినతేదీ వివరాలను నమోదుచేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు  కంప్యూటర్ ఆధారిత విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయారోజుల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో టెట్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. టెట్ ప్రాథమిక ‘కీ’ మార్చి 10న విడుదల చేయనున్నారు. ఆన్సర్ కీపై మార్చి 11 వరకు ఈ కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఏపీటెట్‌కు సంబంధించిన పేపర్-1, పేపర్-2 పరీక్షల్లో కనీస అర్హత మార్కులను ఓసీలకు 60 శాతంగా, బీసీలకు 50 శాతంగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు,ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 40 శాతంగా నిర్ణయించారు.

Also Read : Animal Tripti Dimri : యానిమల్ బ్యూటీ లవ్ లో పడిందా.. ఆ బిజినెస్ మ్యాన్ తో మ్యాటర్ చాలా దూరం వెళ్లిందట..!

టెట్ ఎగ్జామ్ డేట్స్.. 

  • పేపర్-1ఎ : 27.02.2024 – 01.03.2024
  • పేపర్-2ఎ: 02.03.2024 – 04.03.2024 & 06.03.2024
  • పేపర్-1బి : 05.06.2024 (ఉదయం సెషన్)
  • పేపర్-2బి : 05.06.2024 (మధ్యాహ్నం సెషన్)