APIIC : `ఏపీఐఐసీ` అర్థ‌శ‌తాబ్ద‌పు చరిత్ర‌

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏర్పడి సోమ‌వారం నాటికి (సెప్టెంబ‌ర్ 26వ తేదీకి) 50ఏళ్లు. పారిశ్రామిక ప్రగతిలో ప్రత్యేక ముద్ర వేసింది.

  • Written By:
  • Publish Date - September 26, 2022 / 02:25 PM IST

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏర్పడి సోమ‌వారం నాటికి (సెప్టెంబ‌ర్ 26వ తేదీకి) 50ఏళ్లు. పారిశ్రామిక ప్రగతిలో ప్రత్యేక ముద్ర వేసింది. 1973 సెప్టెంబర్‌ 26న రూ.20 కోట్ల మూలధనంతో ఏర్పాటు అయింది. ఇప్పటివరకు 450కి పైగా పారిశ్రామిక పార్కుల నిర్మాణం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 1,25,000 ఎకరాల్లో 3,500కు పైగా యూనిట్ల ఏర్పాటు చేసి చ‌రిత్ర సృష్టించింది.

విభజన తర్వాత రాష్ట్రంలో 93 పారిశ్రామిక పార్కుల అభివృద్ధి చేసింది. రూ.1,708 కోట్ల వ్యయంతో 99,465 మందికి ఉపాధి క‌ల్పించింది. 3 పారిశ్రామిక కారిడర్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంది. 2 మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కుల అభివృద్ధిపైనా దృష్టి పెట్టింది. పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధికి మౌలిక వసతుల సంస్థ పాత్ర ప్రత్యేకంగా ఉంది. సరికొత్త లక్ష్యాలతో 50వ వసంతంలోకి ఏపీఐఐసీ అడుగుపెట్టింది. ఆ సంద‌ర్భంగా ఏపీఐసీసీ ప్ర‌గ‌తిలోని కొన్ని ప్ర‌ధాన ఘ‌ట్టాలు ఇవి.

*హైదరాబాద్‌ పురోగతిలో కీలకమైన హైటెక్‌ సిటీ నుంచి విశాఖలోని రాంకీ ఫార్మా సెజ్‌ వరకు అనేక ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీఐఐసీ బ్రాండ్

*గుంటూరు జిల్లాలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేయనున్న 125 అడుగుల బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహం ప్రాజెక్టులను నిర్వహణా ఏపీఐఐసీదే

*రాష్ట్ర ప్రగతిలో కీలకంగా ఉన్న శ్రీ సిటీ, అచ్యుతాపురం, నెల్లూరు మాంబట్టు , గంగవరం పోర్టు వంటి కీలక ప్రాజెక్టులకు భూసేకరణ సహా అభివృద్ధి చేసింది ఏపీఐఐసీనే

*ఇదే స్ఫూర్తితో మరింత వేగంగా పారిశ్రామిక పార్కులు, మౌలిక వసతుల కల్పనపై దృష్టి

*విశాఖపట్నం – చెన్నై, చెన్నై – బెంగళూరు, హైదరాబాద్‌ – బెంగళూరు కారిడార్లను వేల కోట్లతో అభివృద్ధి చేస్తోంది.

*ఒక్క విశాఖ – చెన్నై కారిడార్‌లోనే 33,000 ఎకరాలు ఉండగా అందులో తొలుత రూ.5,000 కోట్లతో రూ.10,000 ఎకరాలను ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఏడీబీ) సహకారంతో అభివృద్ధి

*చెన్నై – బెంగళూరు కారిడార్‌లో మొత్తం 12,000 ఎకరాల అభివృద్ధి ..ఇందులో తొలుత 2,500 ఎకరాల్లో క్రిస్‌ సిటీ పేరుతో పారిశ్రామిక నగరాన్ని నిర్మిస్తోన్న ఏపీఐఐసీ

*హైదరాబాద్‌ – బెంగళూరు కారిడార్‌లో కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద సుమారు 10,000 ఎకరాల్లో భారీ పారిశ్రామిక వాడ అభివృద్ధి

* వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తి వద్ద 6,739 ఎకరాల్లో‍్ల వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌, 800 ఎకరాల్లో వైఎస్సార్‌ ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌, కృష్ణా జిల్లా మల్లవల్లి వద్ద మెగా ఫుడ్‌ పార్క్‌, కాకినాడ సెజ్‌, తిరుపతి వద్ద ఈఎంసీ 1, ఈఎంసీ 2ల ప్రగతిలో ఏపీఐఐసీ వెన్నెముక

*చిత్తూరు జిల్లా మన్నవరం వద్ద 225 ఎకారల్లో విద్యుత్‌ ఉపకరణాల తయారీ యూనిట్‌, కొప్పర్తి వద్ద 1,000 ఎకరాల్లో పీఎం-మిత్రా పథకం కింద టెక్స్‌టైల్‌ పార్కును అభివృద్ధి చేయడానికి కేంద్రానికి ప్రతిపాదనలు

*విశాఖ, అనంతపురంలలో రెండు మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కుల అభివృద్ధిపై దృష్టి

*పరిశ్రమలకు ఎంతో కీలకమైన నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి .ఇప్పటికే కొప్పర్తికి 100 కోట్లతో, ఓర్వకల్లుకు రూ. 280 కోట్లతో ఒక టీఎంసీ నీటిని సరఫరా చేసే పనుల ప్రారంభం

* కేవలం పెద్ద పరిశ్రమలకే కాకుండా అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఎంఎస్‌ఎంఈల కోసం ప్రత్యేకంగా పార్కుల అభివృద్ధి .రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు, పారదర్శక పారిశ్రామిక విధానం చూసి టాటా, బిర్లా, అదానీ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వ‌చ్చేలా ప్లాన్