Site icon HashtagU Telugu

APIDC : బ‌కాయిలు చెల్లించండి.. కేన్ క‌మిష‌న‌ర్‌ను కోరిన ఏపీఐడీసీ ఛైర్‌ప‌ర్స‌న్ బండి పుణ్య‌శీల‌

Bandi Punyaseela Imresizer

Bandi Punyaseela Imresizer

షుగ‌ర్ ఫ్యాక్ట‌రీల నుంచి ఏపీఐడీసీకి రావాల్సిన బ‌కాయిలు చెల్లించాల్సిందిగా డైరెక్ట‌ర్ ఆఫ్ షుగ‌ర్ అండ్ కేన్ క‌మిష‌న‌ర్ వి.వెంక‌ట్రావ్‌ను ఏపీఐడీసి ఛైర్‌ప‌ర్స‌న్ బండి పుణ్య‌శీల కోరారు. పాత బ‌కాయిల విష‌య‌మై గురువారం కేన్ క‌మిష‌న‌ర్‌తో ఆమె భేటీ అయ్యారు. ఈసంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ గ‌తంలో రాష్ట్రంలోని ఐదు షుగ‌ర్ కంపెనీల్లో సుమారు రూ.17 కోట్లు ఏపీఐడీసీ పెట్టుబ‌డులు పెట్టింద‌ని.. వివిధ కార‌ణాల వల్ల ఆ కంపెనీలు త‌మ‌కు బ‌కాయిలు చెల్లించ‌లేద‌న్న విష‌యాన్ని కేన్ క‌మిష‌న‌ర్ దృష్టికి తీసుకెళ్ళారు. ఇప్పుడు ఆ మొత్తం సుమారు రూ.87 కోట్ల‌కు చేరింద‌న్నారు. ఏపీఐడీసీ ఆర్థిక ప‌రిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆమొత్తాన్ని తిరిగి చెల్లించేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని పుణ్య‌శీల కోరారు. దీనిపై సానుకూలంగా స్పందిచిన క‌మిష‌న‌ర్ ఆ కంపెనీలు మూత ద‌శ‌కు చేరుకున్నాయ‌ని.. ఆ కంపెనీ ఆస్తుల్ని విక్ర‌యిస్తున్నామ‌ని తెలిపారు. ఆ వ‌చ్చే మొత్తంలో ఏపీఐడీసికి చెల్లించాల్సిన లిక్విడిటీని చెల్లిస్తామ‌ని హామీ ఇచ్చారు.

APIDC