Site icon HashtagU Telugu

YS Jagan Rakshi Festival: జగనన్నకు ప్రేమతో..!

Ap Cm

Ap Cm

రక్షా బంధన్‌ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఇతర మహిళా నేతలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత, వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి, వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్ విజయ నిర్మల, రుడా చైర్‌పర్సన్ షర్మిలారెడ్డి తదితరులు సీఎం వైఎస్‌ జగన్‌ నివాసంలో ఆయనకు రాఖీ కట్టినట్లు సమాచారం. బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు శాంతా దీదీ జీ, సోదరీమణులు పద్మజ, మానస కూడా సీఎం వైఎస్‌ జగన్‌కు రాఖీలు కట్టి సెప్టెంబర్‌లో మౌంట్‌ అబూలో జరగనున్న గ్లోబల్‌ సమ్మిట్‌కు ఆహ్వానించారు.