Site icon HashtagU Telugu

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కి మహిళా కమీషన్ నోటీసులు.. ఏపీలో పవన్ వ్యాఖ్యలపై రచ్చ..

AP Womens Commission send notices to Pawan Kalyan

AP Womens Commission send notices to Pawan Kalyan

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వారాహి యాత్ర(Varahi Yatra) రెండో షెడ్యూల్ నిన్నటి నుంచి మొదలైన సంగతి తెలిసిందే. వారాహి యాత్రలో భాగంగా నిన్న ఏలూరు(Eluru)లో భారీ బహిరంగ సభ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సభలో పవన్ మాట్లాడుతూ వాలంటీర్ల ద్వారా సమాచారం కలెక్ట్ చేసి అధికార ప్రభుత్వానికి చెందిన కొందరు వుమెన్ ట్రాఫికింగ్(Women Trafficking) కి పాల్పడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా రచ్చగా మారాయి .

వాలంటీర్ల వ్యవస్థపై పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ(YCP) నాయకులు ఫైర్ అవుతున్నారు. మరో పక్క వాలంటీర్లు కూడా పవన్ పై ఫైర్ అవుతూ ధర్నాలు, పవన్ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. వాలంటీర్లకు పవన్ క్షమాపణలు చెప్పాలని అంటున్నారు. తాజాగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కి ఏపీ మహిళా కమీషన్(AP Women’s Commission) నోటీసులు ఇచ్చింది.

వాలంటీర్లపై, రాష్ట్రంలో మహిళల అదృశ్యంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మహిళా కమీషన్ సీరియస్ గా తీసుకుంది. 30 వేల మంది మహిళలు అదృశ్యం వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ను కోరింది. ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళల అదృశ్యంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు నిజమెంత వివరణ ఇవ్వాలి. కేవలం ఆరోపణ లు చెయ్యడం కాదు, ఆధారాలు చూపించాలి. ఇంత పెద్ద ఆరోపణ చేసిన పవన్ సరైన ఆధారాలు బహిర్గతం చెయ్యాలి. కేంద్రం నిఘా సంస్థల్లో ఎవరు ఈయనకి చెప్పారో చెప్పాలి. మహిళల అదృశ్యంలో వాలంటీర్ల పాత్ర ఏంటో ఆధారాలు చూపాలి. ఆధారాలు లేకుండా మహిళల విషయంలో ఆరోపణలు చేసేస్తా అంటే కుదరదు. పవన్ కళ్యాణ్ తక్షణమే లెక్కలు చూపించాలి. లేదా మహిళలకు, వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలి. 10 రోజుల్లో పవన్ చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ నేరుగా గానీ లేదా తన ప్రతినిధి ద్వారా గాని వివరాలు ఇవ్వాలి. లేదా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని వ్యాఖ్యానించారు. పవన్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు మాత్రం ఏపీలో పూర్తిగా నెగిటివ్ గానే వెళ్తున్నాయి. వీటిపై నేటి ఉదయం నుంచి రచ్చ జరుగుతూనే ఉంది. మరి దీనిపై పవన్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

 

Also Read : CBN Vision 2024 : ఒకేసారి TDP అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌?