Site icon HashtagU Telugu

AP : వైసీపీకి షాక్ ఇచ్చిన వాలంటీర్లు..టీడీపీతోనే మా అడుగులంటూ నిర్ణయం

Ap Volunteers

Ap Volunteers

మొన్నటి వరకు ఓ లెక్క ఇప్పటి నుండి ఓ లెక్క అంటున్నారు ఏపీ వాలంటీర్లు (AP Volunteers). వైసీపీ (YCP) అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వాలంటీరి వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ అధికారులు చేయాల్సిన పనుల దగ్గరి నుండి హెల్త్ డిపార్ట్మెంట్ వరకు ఇలా ప్రతి ఒక్కరి పనులను వాలంటీర్ల చేత చేయిస్తూ వస్తుంది వైసీపీ ప్రభుత్వం. దీంతో ప్రజల చేత ఎన్నుకోబడిన నేతలు..ప్రభుత్వ అధికారులు ఏసీ గదులకు పరిమితం అయితే నెలకు రూ.5000 జీతం తీసుకుంటున్న వాలంటీర్లు మాత్రం ఎండ , వాన , రాత్రి , అపరాత్రి అనేది లేకుండా కష్టపడుతూ వస్తున్నారు. ఇక ఇప్పుడు వారితో ఎన్నికల ప్రచారం కూడా చేయిస్తూ వస్తుంది వైసీపీ సర్కార్. ఇది నచ్చక చాలామంది తమ జాబ్ లకు రాజీనామా చేసారు. మరికొంతమంది ఇష్టం లేక..ఇక తప్పదు అన్నట్లు చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా విజయవాడలో వాలంటీర్లు అధికార వైసీపీని కాదని విపక్ష టీడీపీకి మద్దతు ప్రకటించారు. వాలంటీర్ల సంఘాల ప్రతినిధులు ఈ మేరకు విజయవాడలో సమావేశమై ఓ తీర్మానం చేసారు. ఇప్పటివరకూ వైసీపీకి అండగా ఉంటున్న వాలంటీర్లు ఇకపై టీడీపీకి మద్దతివ్వాలని నిర్ణయించారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంతోపాటు నెలకు 50 వేలు ఆదాయం వచ్చేలా చూస్తానని చంద్రబాబు భరోసా ఇవ్వడంతో వాలంటీర్ల సంఘ ప్రతినిధులంతా టీడీపీ వైపు కొనసాగాలని డిసైడ్ అయ్యారు.

టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందడం తో పాటు నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుందని, అనేక పరిశ్రమలు ఏపీకి వస్తాయని కాబట్టి టీడీపీ వెంటే వెళ్లాలని విజయవాడ వాలంటీర్లు తీర్మానించారు. ఇన్నాళ్లూ వైసీపీ కోసం పనిచేస్తే దక్కింది ఐదు వేలేనని, టీడీపీ అధికారంలోకి వస్తే తమతోపాటు కుటుంబాలు, రాష్ట్రం బాగుపడుతుందనే కారణాలతో వాలంటీర్లంతా ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి వీరిని చూసి మిగతా జిల్లాలోని వాలంటీర్లు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంటే ఇక వైసీపీ ని ఎవ్వరు కాపాడలేరు.

Read Also : Tata Cars: భార‌త్ మార్కెట్లోకి మూడు కొత్త కార్ల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్న టాటా మోటార్స్‌..!

Exit mobile version