AP Trend : BJP కి షాక్‌,కామ్రేడ్ల‌తో TDP,JSP కూట‌మి?

ఏపీ రాజ‌కీయ ఈక్వేష‌న్లు(AP Trend) మారిపోతున్నాయి. కమ్యూనిస్ట్ లు కీల‌కంగా మార‌బోతున్నారు. అందుకు అడుగులు హైద‌రాబాద్ లో ప‌డుతున్నాయి.

  • Written By:
  • Updated On - May 20, 2023 / 02:46 PM IST

ఏపీ రాజ‌కీయ ఈక్వేష‌న్లు(AP Trend) మారిపోతున్నాయి. కమ్యూనిస్ట్ లు కీల‌కంగా మార‌బోతున్నారు. అందుకు సంబంధించిన అడుగులు హైద‌రాబాద్ లో ప‌డుతున్నాయి. ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి(NTR centenary celebrations)వేడుక‌ల్లో ఏపీ పొత్తు రాజ‌కీయానికి బీజం ప‌డేలా కనిపిస్తోంది. ఆ వేడుక‌ల‌కు బీజేపీకి సంబంధించిన వాళ్ల‌కు ఎవ‌రికీ పెద్ద‌గా ప్రాధాన్యం లేదు. నంద‌మూరి కుటుంబం కోటా కింది పురంధ‌రేశ్వ‌రికి మాత్రమే ఆహ్వానం ఉంది. కానీ, సీసీఐ, సీపీఎం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు డీ. రాజా(Raja), సీతారాంఏచూరికి (seetaram yechury)  మాత్రం ప్ర‌త్యేక ఆహ్వానం ల‌భించింది. అదే వేదిక‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా హాజరు కాబోతున్నారు. సినీ, రాజకీయ కాంబినేష‌న్లో జ‌రుగుతోన్న ఈ వేడుక రాజ‌కీయ పొత్తుల‌కు సంకేతంగా క‌నిపిస్తోంది.

ఏపీ రాజ‌కీయ ఈక్వేష‌న్లు. మారిపోతున్నాయి(AP Trend) 

ప్ర‌స్తుతం జ‌న‌సేన‌, బీజేపీ పొత్తు ఉంద‌ని ఆ పార్టీల‌కు మాత్ర‌మే తెలిసేలా రాజ‌కీయం న‌డుపుతున్నాయి. రాబోవు రోజుల్లో టీడీపీతో క‌లిసి వెళ్లాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నారు. అందుకు బీజేపీ క‌లిసి వ‌స్తే వెల్ , లేదంటే క‌టీఫ్ చెప్ప‌డానికి సిద్ద‌మ‌య్యార‌ని తెలుస్తోంది. అంతేకాదు, ఈ మ‌ధ్య వ‌చ్చిన స‌ర్వేల సారాంశాన్ని ఆధారంగా చేసుకుని బీజేపీని వ‌దిలించుకోవాల‌ని జ‌న‌సేన చూస్తోంది. టీడీపీతో క‌లిసి వెళితే చాల‌నే ధోర‌ణిలో ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. అదే జ‌రిగితే క‌మ్యూనిస్ట్ లు, టీడీపీ, జ‌న‌సేన క‌లిసి కూట‌మిగా ఏర్ప‌డేందుకు(AP Trend) ఛాన్స్ ఉంది. దానికి బ‌లం చేకూరేలా శ‌నివారం హైద‌రాబాద్ లో జ‌రిగే ఎన్టీఆర్ శ‌తిజ‌యంతి వేడుక‌ల (NTR centenary celebrations)వేదిక అల‌రించ‌నుంది.

క‌మ్యూనిస్ట్ లు, టీడీపీ, జ‌న‌సేన క‌లిసి కూట‌మిగా (AP Trend)

కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీకి ప‌డ‌దు. కాంగ్రెస్ ముక్త్ భార‌త్ నినాదంతో మోడీ, షా ద్వ‌యం ప‌నిచేస్తోంది. ఆ క్ర‌మంలో ప్రాంతీయ పార్టీల‌తో క‌లిసి ప‌లు చోట్ల ప్ర‌భుత్వాల‌ను ఏర్పాటు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీల‌తో పొత్తులేకుండా ఉనికి కూడా బీజేపీకి ఉండ‌దు. ఆ విష‌యం తెలుసుకున్న క‌మ‌ల‌నాథులు జ‌న‌సేన లాంటి పార్టీని ప‌ట్టుకుని ఊగులాడుతోంది. టీడీపీ దూర‌మైన త‌రువాత బీజేపీకి పెద్ద‌గా ప్రాధాన్యం లేకుండా పోయింది. ఆ పార్టీ ఓటు బ్యాంకు కేవ‌లం 2శాతం మాత్ర‌మే. కాంగ్రెస్ పార్టీ కంటే దారుణంగా బీజేపీ పార్టీ ప‌రిస్థితి ఏపీలో ఉంద‌ని అంద‌రికీ తెలిసిందే. అందుకే, ప‌వ‌న్ తో గేమాడాల‌ని చూసింది. కానీ, మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని జ‌న‌సేనాని చాక‌చ‌క్యంగా దూరం జరుగుతున్నారు.

Also Read : Delhi CBN : చంద్ర‌బాబుపై NDA, UPA `హాట్ లైన్ `ఆప‌రేష‌న్‌

2019 ఎన్నిక‌ల ముందు నుంచి వైసీపీ, బీజేపీ ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణితో ఉన్నాయి. ఆ రెండు పార్టీల‌ను వేర్వేరుగా చూడ‌లేని ప‌రిస్థితుల్లో ఏపీ ఓట‌ర్లు(AP Trend) ఉన్నారు. పైగా మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు విచార‌ణ వెనుక ఢిల్లీ పెద్ద‌లు ఉన్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. అదో మైన‌స్ పాయింట్ గా బీజేపీకి మారింది. గ‌తంలోనూ ఆ రెండు పార్టీలు పార్ల‌మెంట్ లోప‌ల‌, బ‌య‌ట ప‌ర‌స్ప‌రం స‌హ‌కారం అందించుకున్నాయి. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతోంది. రాజ‌కీయాల‌కు అతీతంగా న‌రేంద్ర మోడీతో బంధం ఉంద‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెప్ప‌డ‌మే అందుకు ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నం. అంటే, ఆ రెండు పార్టీలు ఒకేతానులో ముక్క‌లా ప‌నిచేస్తున్నాయి. అందుకే, బీజేపీ నుంచి విడిపోవాల‌ని ప‌వ‌న్ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆయ‌న టార్గెట్ అంతా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని గ‌ద్దె దింపడమే. ఆ దిశ‌గా అడుగులు వేస్తోన్న ప‌వ‌న్ కు (Pawan) ఆశాజ్యోతిలాగా టీడీపీ క‌నిపిస్తోంది.

CBN Demand : క‌ర్ణాట‌క ఫ‌లితాల‌ఎఫెక్ట్ ! చంద్ర‌బాబు వ‌ద్ద‌కు బీజేపీ దూత‌లు.?

బీజేపీ కంటే కమ్యూనిస్ట్ ల‌ను క‌లుపుకుని కూట‌మిగా వెళితే రాబోవు రోజుల్లో ఏపీకి ఎంతో కొంత మేలు జ‌రుగుతుంద‌ని(AP Trend) చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఆలోచిస్తున్నార‌ట‌. అందుకే, కమ్యూనిస్ట్ ల‌తో వేదిక‌ను పంచుకోవ‌డం శ‌నివారం జ‌రిగే ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌ల నుంచి ప్రారంభిస్తున్నారు. ఆ రెండు పార్టీల‌తో పొత్తు పెట్టుకుంటామ‌ని సీపీఐ రామ‌కృష్ణ ఇటీవ‌ల సూచాయ‌గా ప్ర‌క‌టించారు. అంటే, కూట‌మి ఖాయంగా క‌నిపిస్తోంది. తెలంగాణ‌లోనూ ఇదే కూట‌మి ఎన్నిక‌ల రంగంలోకి దిగితే, కింగ్ మేక‌ర్ కావ‌డానికి అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నాయి. మొత్తం మీద బీజేపీకి బై చెబుతూ క‌మ్యూనిస్ట్ ల‌కు జై కొట్టేలా టీడీపీ, జ‌న‌సేన అడుగులు వేస్తున్నామ‌ని చెప్ప‌డానికి హైద‌రాబాద్ లోని ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి (NTR centenary celebrations) వేడుక ఉప‌యోగ‌ప‌డ‌నుంది.