ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో టూరిస్టు బస్సు కొండపై నుంచి లోయలో పడింది. ఈ ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. పర్యాటక ప్రాంతమైన వంజంగివద్ద ఈ ప్రమాదం జరిగింది. టూరిస్టు బస్సు వైజాగ్ నుంచి పాడేరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. అంబులెన్స్ ల ద్వారాపోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.
వంజంగి హిల్స్ దగ్గర ఎత్తైన కొండలు ఎక్కే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణాప్రాయం తప్పిందని టూరిస్టులు అంటున్నారు.
Andhra Pradesh | At least 10 were injured after a tourist bus fell off a hill in Vanajangi in Alluri Sitharama Raju (ASR) district. The bus was going from Visakhapatnam to Paderu. Injured rescued by locals, rushed to hospital pic.twitter.com/HQ3mIW9q43
— ANI (@ANI) October 9, 2022