CBI: సీబీఐ కేసుల్లో అగ్రస్థానంలో ఏపీ..

దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై ఏ రాష్ట్రంలో ఎన్ని సీబీఐ కేసులు నమోదయ్యాయో వెల్లడైంది.

దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై ఏ రాష్ట్రంలో ఎన్ని సీబీఐ (CBI) కేసులు నమోదయ్యాయో వెల్లడైంది. గత ఐదేళ్లలో ప్రజాప్రతినిధులపై ఏపీ (AP)లోనే అత్యధిక సీబీఐ కేసులు నమోదయ్యాయి. 2017-22 మధ్య కాలంలో ఏపీలో సీబీఐ (CBI) అత్యధికంగా 10 కేసులు నమోదు చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో 6 చొప్పున సీబీఐ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంటుకు తెలియజేశారు.

అరుణాచల్ ప్రదేశ్ లో 5, పశ్చిమ బెంగాల్ లో 5, తమిళనాడులో 4, మణిపూర్ లో 3, ఢిల్లీలో 3, బీహార్ లో 3, జమ్మూ కశ్మీర్ 2, కర్ణాటకలో 2 కేసులు, హర్యానాలో 1, చత్తీస్ గఢ్ లో 1, మేఘాలయలో 1, ఉత్తరాఖండ్ లో 1, మధ్యప్రదేశ్ లో 1, మహారాష్ట్రలో 1, లక్షద్వీప్ లో 1 కేసు నమోదైనట్టు వివరించారు.

అదే సమయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సీబీఐ 56 కేసులు నమోదు చేసిందని చెప్పారు. వీటిలో 22 కేసుల్లో చార్జిషీటు నమోదు చేయడం జరిగిందని కేంద్ర మంత్రి వివరించారు. ఆయా కేసుల్లో సీబీఐ 2017లో దోషులుగా తేల్చిన వారి శాతం 66.90 కాగా, 2021లో అది 67.56 శాతంగా నమోదైంది. 2020లో అత్యధికంగా 69.83 శాతం మంది దోషులుగా నిర్ధారణ అయినట్టు మంత్రి వెల్లడించారు.

Also Read:  AAP: 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెర.. ఢిల్లీలో ఆప్ విజయం..!