Nominations : కూటమి నుండి ఫస్ట్ నామినేషన్ వేసిందెవరో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ , ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది

  • Written By:
  • Publish Date - April 18, 2024 / 03:26 PM IST

దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా (Lok Sabha) నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు చోట్ల పోలింగ్ సైతం పూర్తి అయ్యింది. ఇక ఈరోజు ఎన్నికలకు సంబదించిన నాలుగో విడత ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ , ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇక నోటిఫికేషన్ వచ్చిందో లేదో తెలుగు రాష్ట్రాల్లో అసలైన ఎన్నికల సందడి మొదలైంది. తెలంగాణ లో 17 ఎంపీ స్థానాలతో పాటు ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక జరగనుండగా..ఇటు ఏపీ లో 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మే 13 న పోలింగ్ జరగనుండగా..జూన్ 04 న ఫలితాలు రాబోతున్నాయి.

ఈ క్రమంలో ఈరోజు నామినేషన్ల పర్వం మొదలైందో లేదో ..చాలామంది తమ నామినేషన్లు వేసేందుకు పోటీ పడ్డారు. ఏపీలో కూటమి అభ్యర్థి మొదటి నామినేషన్ వేసి వార్తల్లో నిలిచారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి తొలి నామినేషన్ దాఖలైంది. టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) నామినేషన్‌ను.. ఆయన సతీమణి హేమలత దాఖలు చేశారు. పయ్యావుల అనుచరులు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లిన హేమలత.. స్థానికంగా ఉన్న తహసిల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను అందజేశారు.

We’re now on WhatsApp. Click to Join.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టిడిపి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి , ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక , గన్నవరం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు , కొవ్వూరు వైసీపీ అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కావలిలో వైసీపీ అభ్యర్థి ప్రతాప్ కుమార్ రెడ్డి , తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైసీపీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తరపున అతని నామినేషన్ పథ్రాన్ని ఆయన తల్లి మాజీమంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి ఆమె మరో కుమారుడు కలిసి నామినేషన్ వేశారు. ఏపీలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ టీడీపీ అభ్యర్థులే.. అధికార పార్టీ కంటే ముందుగా తొలి నామినేషన్లు దాఖలు చేశారు. ఇటు తెలంగాణ లో తొలిరోజే కీలక నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటి వరకు మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్ల పత్రాలు సమర్పించారు.

Read Also : USA Head Coach: టీ20 ప్ర‌పంచ క‌ప్‌కు ముందు USA జట్టుకు గుడ్ న్యూస్‌.. ప్ర‌ధాన కోచ్‌గా ఆసీస్ మాజీ ప్లేయ‌ర్‌