Teachers Vs Jagan : సీఎం జ‌గ‌న్ కు ఏపీ టీచ‌ర్ల జ‌ల‌క్‌

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, టీచ‌ర్ల మ‌ధ్య యుద్ధం తీవ్ర‌త‌రం అవుతోంది. మిలియ‌న్ మార్చ్ కు సిద్ధం అవుతోన్న టీచ‌ర్లు సెప్టెంబ‌ర్ 5వ తేదీన జ‌ర‌గనున్న ఉపాధ్యాయ దినోత్స‌వ వేడుక‌ల‌ను బ‌హిష్క‌రించాల‌ని నిర్ణ‌యించారు.

  • Written By:
  • Publish Date - September 3, 2022 / 03:29 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, టీచ‌ర్ల మ‌ధ్య యుద్ధం తీవ్ర‌త‌రం అవుతోంది. మిలియ‌న్ మార్చ్ కు సిద్ధం అవుతోన్న టీచ‌ర్లు సెప్టెంబ‌ర్ 5వ తేదీన జ‌ర‌గనున్న ఉపాధ్యాయ దినోత్స‌వ వేడుక‌ల‌ను బ‌హిష్క‌రించాల‌ని నిర్ణ‌యించారు. అంతేకాదు, ప్ర‌భుత్వం ఇచ్చే అవార్డులు, రివార్డుల‌ను తిర‌స్క‌రించారు.

మాజీ రాష్ట్రప‌తి స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌తి ఏటా ఏటా సెప్టెంబ‌ర్ 5న ఉపాధ్యాయ దినోత్స‌వం దేశ వ్యాప్తంగా జ‌రుపుకుంటారు. ఆ వేడుక‌ల‌కు ఏపీ ప్ర‌భుత్వం స‌ర్వం సిద్ధం చేస్తోంది.ఉపాధ్యాయుల‌ను అవ‌మానించేలా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని భావించిన ఏపీటీఎఫ్ ఆ రోజున నిర‌స‌న‌కు పిలుపునిచ్చింది. అందుకే, సెప్టెంబ‌ర్ 5న జ‌రిగే ఉపాధ్యాయ దినోత్స‌వాన్ని బ‌హిష్క‌ర‌ణ‌కు పిలుపు ఇచ్చింది.

ప్ర‌భుత్వం నుంచి అందే స‌న్మానాల‌ను తిర‌స్క‌రించాల‌ని ఏపీటీఎఫ్ తెలియ‌చేసింది. సీపీఎస్ ర‌ద్దు కోరుతూ ఉద్య‌మాలు చేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయుల‌పై అక్ర‌మ కేసులు పెట్ట‌డాన్ని ఏపీటీఎప్ తీవ్రంగా ఖండించింది. ఉపాధ్యాయుల‌పై కేసులు ఎలా పెడ‌తార‌ని ప్ర‌శ్నించింది. ఏపీటీఎఫ్ తీసుకున్న ఈ నిర్ణ‌యానికి యునైటెడ్ టీచ‌ర్స్ ఫెడ‌రేష‌న్ (యూటీఎఫ్‌) కూడా మ‌ద్ద‌తు తెలిపింది. సోమ‌వారం నాటి ఉపాధ్యాయ దినోత్స‌వాల‌కు దూరంగా ఉండాల‌ని స‌భ్యుల‌కు యూటీఎఫ్ పిలుపునిచ్చింది.

టీచ‌ర్లు, ఉద్యోగులు ఏపీ ప్ర‌భుత్వం మీద ర‌గిలిపోతున్నారు. సీపీఎస్ ర‌ద్దు తో పాటు ప‌లు స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం ముందుంచిన టీచ‌ర్ల‌కు అవ‌మానం జ‌రుగుతోంది. ఆ విష‌యాన్ని ప‌లుమార్లు మీడియా ముందు చెప్పారు. పుండు మీద కారంలాగా టీచ‌ర్ల‌ను క‌ట్ట‌డీ చేయ‌డానికి ఫేస్ రిగ‌గ్నైజేష‌న్ హాజ‌రు ప‌ద్ధ‌తిని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీసుకొచ్చారు. దాని ఆధారంగా నీడ‌లా ప్ర‌భుత్వం వెంటాడుతోంద‌ని టీచ‌ర్లు గ‌గ్గోలు పెడుతున్నారు. అంతేకాదు, అరెస్ట్ లు కూడా దాని ఆధారంగానే చేస్తున్నార‌ని అనుమానిస్తున్నారు. మొత్తం మీద మిలియ‌న్ మార్చ్ కు సిద్ధం అవుతోన్న టీచ‌ర్లు అంత‌కంటే ముందే జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి సెప్టెంబ‌ర్ 5 జ‌ల‌క్ ఇచ్చారు. దీన్ని ప్ర‌భుత్వం ఎలా హాండిల్ చేస్తుందో చూడాలి.