Site icon HashtagU Telugu

AP 10th Results : ఎల్లుండి ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల

CBSE Guidelines

CBSE Guidelines

ఏపీలోని పదో తరగతి విద్యార్థులకు (10th Class Students) గుడ్ న్యూస్..ఎల్లుండి (ఏప్రిల్ 22) సోమవారం ఉదయం 11 గంటలకు విజయవాడ ఎంజీ రోడ్డులోని తాజ్ వివంటా హోటల్లో పదో తరగతి ఫలితాలు (10th Results) విడుదల చేయనున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. విద్యాశాఖ కమిషన్ ఎస్.సురేష్ కుమార్ (Suresh kumar) ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఏడాది మార్చి 18 నుంచి 30 వరకూ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఏడాది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 6.3 లక్షల మందికి పైగా విద్యార్ధులు పదో తరగతి పరీక్షలు రాయడం జరిగింది. మూడు వేల 473 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షల ప్రక్రియ ముగిసిన వెంటనే అధికారులు మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించి ఈ నెల 8వ తేదీతోనే ముగించారు. మరోసారి జవాబు పత్రాల పరిశీలన, మార్కుల నమోదు, కంప్యూటీకరణ ప్రక్రియను సైతం ఇప్పుటికే పూర్తి చేశారు. ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో స్టూడెంట్స్ ఫలితాలను చెక్‌ చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Read Also : Chiranjeevi : చిన్నప్పుడు క్రికెట్‌లో జరిగిన గాయం గురించి.. హీరో కార్తికేయతో షేర్ చేసుకున్న చిరు..