AP SSC 10th Results 2025: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి (AP SSC 10th Results 2025) ఫలితాలు 2025 ఏప్రిల్ 23న ఉదయం 10 గంటలకు విడుదలయ్యాయి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ (BSEAP) ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా విడుదల చేసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఓపెన్ స్కూల్ ఫలితాలు కూడా విడుదలయ్యాయి.
ఫలితాలను ఎలా చెక్ చేయాలి?
- అధికారిక వెబ్‌సైట్‌లు (bse.ap.gov.in లేదా results.bse.ap.gov.in)ని సందర్శించండి.
- “SSC Public Examinations March 2025 Results” లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ నంబర్, అవసరమైన వివరాలను నమోదు చేయండి.
- సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీ ఫలితం, మార్క్స్ మెమో స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- భవిష్యత్తు ఉపయోగం కోసం మార్క్స్ మెమోను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.
ఇతర మార్గాలు
- వాట్సాప్: మన మిత్ర వాట్సాప్ ఛానెల్ ద్వారా హాల్ టికెట్ నంబర్ పంపి ఫలితాలు పొందవచ్చు.
- SMS/కాల్: BSNL వినియోగదారులు 1255225, ఎయిర్టెల్ వినియోగదారులు 52800, వొడాఫోన్ వినియోగదారులు 58888 నంబర్‌లకు కాల్ చేయవచ్చు.
- ఇతర వెబ్‌సైట్లు: manabadi.co.in, sakshieducation.com, లేదా results.eenadu.net వంటి సైట్‌లలో కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయి.
Also Read: Surgical Strike : మోడీ సీరియస్.. పాక్‌పై మరో సర్జికల్ స్ట్రైక్ తప్పదా ?
ముఖ్య వివరాలు
- ఏపీలో పదో తరగతి పరీక్షలు మార్చి 17 నుండి 31, 2025 వరకు 3,450 కేంద్రాల్లో జరిగాయి, 6.19 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు (3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు).
- ఉత్తీర్ణతకు కనీసం 35% మార్కులు ప్రతి సబ్జెక్టులో అవసరం.
- సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ త్వరలో ప్రకటించనున్నారు. రీవాల్యుయేషన్ కోసం రూ.500 (రీకౌంటింగ్), రూ.1000 (రీవెరిఫికేషన్) ఫీజు చెల్లించాలి.