AP SSC Results: నేడు ఏపీ పదో తరగతి ఫలితాలు.. మీ ఫ‌లితాలను చెక్ చేసుకోండిలా..!

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న పదో తరగతి ఫలితాలు (AP SSC Results 2023) నేడు విడుదల కానున్నాయి.

  • Written By:
  • Updated On - May 6, 2023 / 10:24 AM IST

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న పదో తరగతి ఫలితాలు (AP SSC Results 2023) నేడు విడుదల కానున్నాయి. శనివారం ఉదయం 11 గంటలకు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Education Minster Botsa Satyanarayana) విజయవాడలో ఫలితాలు విడుదల చేయనున్నారు. ఉపాధ్యాయ సంఘాల నేతలతో శుక్రవారం జరిగిన చర్చల సందర్భంగా మంత్రి బొత్స స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఏప్రిల్ 19 నుంచి 26 వరకు రాష్ట్రంలోని 23 కేంద్రాల్లో స్పాట్ వాల్యుయేషన్ నిర్వహించారు.

AP SSC ఫలితాలు (AP SSC Results 2023) మే 6న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ ప్రకటించింది. ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.inలో ఫలితాలను చూసుకోవచ్చు.

Also Read: Operation Kaveri: విజయవంతమైన “ఆపరేషన్ కావేరీ”.. సూడాన్ నుంచి భారత్ చేరుకున్న 3800 మంది ఇండియ‌న్స్..!

10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 18 వరకు జరగగా ఆరు లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఏప్రిల్ 26న ఇంటర్మీడియట్ ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. విద్యార్థులు ఫలితాలను తనిఖీ చేయడానికి bse.ap.gov.inలో BSE AP అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఫలితాల వివరాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం ఉదయం విలేకరుల సమావేశంలో విడుదల చేయనున్నారు. విలేకరుల సమావేశంలో ఉత్తీర్ణత శాతం, మెరిట్ జాబితా, టాపర్ల పేర్లను కూడా ఆయన ప్రకటిస్తారు.

Also Read: Electric Car: మార్కెట్‌లోకి మరో ఎలక్ట్రిక్ కారు.. తక్కువ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు

రిజల్ట్ ఎలా చూడాలంటే..?

స్టెప్ 1: bse.ap.gov.inలో BSEAP అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి

స్టెప్ 2: హోమ్ పేజీలో Ap SSC ఫలితాలు 2023పై క్లిక్ చేయండి

స్టెప్ 3: హాల్ టిక్కెట్ నంబర్‌ను ఎంటర్ చేయడం ద్వారా మీరు మీ ఫలితాన్ని చూసుకోవచ్చు

స్టెప్ 4: అక్క‌డే మీకు డౌన్ లోడ్ లేదా ప్రింట్ అనే ఆప్షన్ క‌నిస్తుంది. దీంతో మీరు మీ ఫ‌లితాల‌ను కూడా డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు.