AP Space Policy : ఏపీ స్పేస్‌ పాలసీ 4.0 జీవో విడుదల..

AP Space Policy : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్పేస్ టెక్నాలజీ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కీలక అడుగు వేసింది.

Published By: HashtagU Telugu Desk
Ap Space Policy

Ap Space Policy

AP Space Policy : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్పేస్ టెక్నాలజీ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కీలక అడుగు వేసింది. 2025–30 కాలపరిమితిలో అమలు చేయబోయే ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0 ను అధికారికంగా విడుదల చేసింది. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ జీవో ఎంఎస్ నెం.122 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ స్పేస్ పాలసీని ఏపీ స్పేస్ సిటీ కార్పొరేషన్ అనే ప్రత్యేక ప్రయోజన వాహకం (SPV) ద్వారా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా పాలసీ అమలు మరింత సమర్థవంతంగా సాగనుంది. స్పేస్ రంగంలో వ్యాప్తి చెందుతున్న గ్లోబల్ ట్రెండ్‌లు, భారతదేశంలో అభివృద్ధి చెందిన స్పేస్ ఈకో సిస్టమ్, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రముఖ ప్రాజెక్టులు వంటి అంశాలు పాలసీలో ప్రత్యేకంగా చర్చించబడ్డాయి.

పాలసీ అమలులో భాగంగా, రాష్ట్రం తిరుపతి , సత్యసాయి జిల్లాల్లో స్పేస్ సిటీలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్పేస్ టెక్నాలజీతో సంబంధిత స్టార్టప్‌లకు అవసరమైన మౌలిక వసతులు, ఫండింగ్, మెంటరింగ్ వంటి అంశాల్లో విస్తృతంగా సహకారం అందించనున్నట్లు పాలసీలో పేర్కొన్నారు. వీటితోపాటు సబ్‌సెక్టార్‌లపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు.

ఈ రంగంలో ఉత్పత్తి చేస్తున్న తయారీ సంస్థలు, అసెంబ్లీ యూనిట్లకు రాష్ట్ర ప్రభుత్వం పన్ను రాయితీలు, భూసమీకరణ, అవసరమైన మౌలిక వసతుల కల్పన వంటి విధంగా ప్రోత్సాహకాలు అందించనుంది. ఇందుకోసం ల్యాండ్ అలాట్‌మెంట్ విధానంపై స్పష్టమైన మార్గదర్శకాలను స్పేస్ పాలసీలో చేర్చారు.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గగన్‌యాన్, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL), ఇస్రో కమర్షియల్ ప్రాజెక్టులు వంటి కీలక ప్రాజెక్టులకు అనుసంధానంగా రాష్ట్ర స్పేస్ పాలసీ రూపుదిద్దుకుంది. ప్రపంచవ్యాప్తంగా స్పేస్ రంగంలో పెరుగుతున్న పెట్టుబడులను ఏపీ వైపు ఆకర్షించాలన్నదే ప్రధాన లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

ఈ ఉత్తర్వులను విడుదల చేసిన శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్, పాలసీ అమలుతో రాష్ట్రం భారతదేశ స్పేస్ మ్యాప్‌లో ప్రముఖ స్థానాన్ని సంపాదిస్తుందని, దేశవిదేశాల్లో ఉన్న ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా దారితీయడం లక్ష్యమని పేర్కొన్నారు.

China vs America : తైవాన్ విషయంలో చైనా దూకుడు పెరిగితే యుద్ధానికి సిద్ధంగా అమెరికా..?

  Last Updated: 13 Jul 2025, 09:53 PM IST