AP Skill : జ‌గ‌న్ కు ఆ ద‌మ్ముందా? చంద్ర‌బాబు ఛాలెంజ్ !

`త‌న 40 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో సాంకేతికంగా(AP Skill) ఎలాంటి త‌ప్పు చేయ‌లేదు.

  • Written By:
  • Updated On - March 21, 2023 / 02:00 PM IST

`త‌న 40 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో సాంకేతికంగా(AP Skill) ఎలాంటి త‌ప్పు చేయ‌లేదు. నిరూపిస్తే ఎలాంటి శిక్ష‌కైనా సిద్ధం. ద‌మ్ముంటే నిరూపించండి..` అంటూ రెండేళ్ల క్రితం చంద్ర‌బాబునాయుడు(CBN) అసెంబ్లీ సాక్షిగా స‌వాల్ విసిరారు. ఆ రోజు నుంచి సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏదో ఒక కేసును నిరూపించాల‌ని వ్య‌వ‌స్థ‌ల‌పై ఒత్తిడి తెచ్చారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌రావ‌తి ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ , ఫైబ‌ర్ నెట్‌, స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ సీమెన్స్ త‌దిత‌ర అంశాల‌ను తీసుకొచ్చి రాజ‌కీయ ర‌భ‌స మాత్రం చేయ‌గ‌లిగారు. కానీ, అధికారికంగా చంద్ర‌బాబు పాల‌నలోని లోపాలు, ఆయ‌న చేసిన విధాన ప‌ర‌మైన నిర్ణ‌యాల‌ను త‌ప్పుగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిరూపించ‌లేక‌పోయారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సీమెన్స్‌(AP Skill)

తాజాగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సీమెన్స్‌(AP Skill) కుంభకోణంలో రూ.371 కోట్ల ప్రజాధనాన్ని చంద్ర‌బాబు (CBN)కాజేశార‌ని అసెంబ్లీ వేదిక‌గా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆరోపిస్తున్నారు. సోమవారం శాసనసభలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌పై జరిగిన చర్చలో అతిపెద్ద కుంభకోణానికి సంబంధించి సీమెన్స్‌ అంతర్గత విచారణ జరిపి, తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశార‌ని వెల్ల‌డించారు. అంటే, 371 కోట్లు కొల్లగొట్టడానికి ఆనాడు మంత్రివర్గం అనధికారిక ప్రైవేట్ అంచనాల నోట్‌ను ఆమోదించింద‌ని ఆరోపించారు. అనధికార వ్యక్తులతో ఒప్పందాల‌పై సంతకం చేయడం ద్వారా చంద్ర‌బాబు నైపుణ్యంగా స్కామ్ చేశార‌ని దుమ్మెత్తిపోశారు.

సీమెన్స్ తో చేసుకున్ని ఒప్పందం

సీమెన్స్ తో చేసుకున్ని ఒప్పందం, అందుకు సంబంధించిన జీవోలు, ఎంఒయు షరతులు రూ 371 కోట్ల‌ను(AP Skill) దోచుకునే విధంగా ఉన్నాయని జ‌గ‌న్ చెబుతున్నారు. స్కామ్‌కు స్క్రిప్ట్‌ను రూపొందించి దర్శకత్వం చంద్ర‌బాబు(CBN) వ‌హించార‌ని ఆరోపించారు. క్యాబినెట్ ప్రైవేట్ నోట్‌ను ఆమోదించింది, సంబంధిత జిఓలో సిమెన్స్ నుండి గ్రాంట్-ఇన్-ఎయిడ్ రూపంలో వచ్చే యువతలో నైపుణ్యాల అభివృద్ధికి ప్రతిపాదిత మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ. 3,356 కోట్లలో 90% గురించి మాట్లాడినట్లు ఆయన వివరించారు. ఎంఓయూలో గ్రాంట్-ఇన్-ఎయిడ్ గురించి ప్రస్తావించలేదన్నారు.

నోట్ ఫైళ్లను ధ్వంసం చేసే ప్రయత్నాలు

“సీమెన్స్ నుండి గ్రాంట్-ఇన్-ఎయిడ్ (AP Skill) ఎప్పుడూ రాలేదని, టీడీపీ ప్రభుత్వం మూడు నెలల్లో ఐదు విడతల్లో రూ. 371 కోట్లకు (పన్నులతో సహా) సమానమైన ప్రాజెక్ట్ వ్యయంలో 10% హడావిడిగా చెల్లించిందని ఆరోపించారు. “సీమెన్స్ నుండి గ్రాంట్-ఇన్-ఎయిడ్ రాకుండా 10% ఆర్థిక సహాయం విడుదల చేయడంపై కింది స్థాయి అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో, చంద్ర‌బాబు(CBN) ఆ మొత్తాన్ని విడుదల చేయాలని ఆదేశించారు. నోట్ ఫైళ్లపై ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ సంతకాలు చేశార‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గుర్తు చేశారు. ఈ నోట్ ఫైళ్లను ధ్వంసం చేసే ప్రయత్నాలు కూడా జరిగాయ‌ని ఆరోపించారు.

Also Read : CBN Vision : చంద్ర‌బాబు జీవితం మ‌లుపు, ఇందిరాగాంధీ మైమ‌ర‌పు!

సీమెన్స్ ఏనాడూ నైపుణ్యాభివృద్ధి శిక్షణ పథకాలను(AP Skill) అమలు చేయలేదని కోర్టుకు తెలిపిందని ఆయన గుర్తు చేశారు. సిమెన్స్ తన అఫిడవిట్‌లో తెలుగుదేశం (CBN)ప్రభుత్వం ఎంఓయుపై సంతకం చేసిన అరెస్టయిన కంపెనీ అధికారులు దానిని ఎప్పుడూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లలేదని , వారు తమ ప్రైవేట్ హోదాలో ఎంఒయుపై సంతకం చేశారని కోర్టుకు తెలిపింది.

కుంభ‌కోణం గురించి మూడేళ్లుగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (AP Skill)

ప్రజా ధనాన్ని దోచుకోవడానికి సీమెన్స్ (AP Skill) మాజీ అధికారులతో (ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు) కుట్ర పన్నారని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆరోపించారు. యువతకు శిక్షణ కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు మరియు క్లస్టర్‌ల ఏర్పాటు కోసం వ్యక్తులు రూపొందించిన వ్యయ అంచనాల ప్రతిపాదిత నోట్‌ను క్యాబినెట్ సమావేశం ఎలా ఆమోదించగలదు? ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం విదేశాల్లోని షెల్ కంపెనీలకు వెళ్లి మనీలాండరింగ్ మార్గాల ద్వారా చంద్ర‌బాబు(CBN) జేబుల్లోకి మళ్లిందని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేసిన ఆరోప‌ణ‌.

సీఐడీ విచార‌ణ నిరూపించ‌లేక

ఇదే కుంభ‌కోణం(AP Skill) గురించి మూడేళ్లుగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెబుతూనే ఉన్నారు. దానిపై సీఐడీ విచార‌ణ కూడా వేశారు. కానీ, కొండ‌ను త‌వ్వి ఎలుక‌ను పట్టిన విధంగా ద‌ర్యాప్తులో ఏమీ తేల్చ‌లేక‌పోయింది. అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు (CBN) కుంభ‌కోణం చేశార‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అసెంబ్లీ బ‌య‌ట‌, లోప‌ల ఆరోప‌ణ‌ల‌కు దిగుతున్నారు. ఒక వేళ చంద్ర‌బాబు నిధుల‌ను మ‌ళ్లించి ఉంటే విచార‌ణ చేసి బ‌య‌ట పెట్టొచ్చు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉన్నారు. కేంద్రంలోనూ ఆయ‌న కు స‌హ‌కారం అందించే ప్ర‌భుత్వం ఉంది. అయిన‌ప్ప‌టికీ అధికారికంగా నిరూపించ‌లేక నానా తంటాలు ప‌డుతున్నారు. రాజ‌కీయంగా మాత్రం దుమ్మెత్తి పోస్తున్నారు. అందుకే, సాంకేతికంగా తప్పు చేసి ఉంటే ఏ శిక్ష‌కైనా సిద్ద‌మ‌ని చంద్ర‌బాబు స‌వాల్ చేస్తున్నారు. ఆయ‌న స‌వాల్ ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్వీక‌రించే ద‌మ్ము ఉందా? లేదా? అనేది మూడేళ్ల ఆయ‌న పాల‌న చెబుతోంది.

Also Read : AP Assembly :TDP,YCP`బ్లాక్ డే`వార్‌!`ట్విట్ట‌ర్`డీపీల ఛేంజ్!!