AP Schools: ఏపీలోని పాఠశాలలకు మే 1 నుంచి వేసవి సెలవులు.. జూన్ 12న రీ ఓపెనింగ్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2023 కోసం పాఠశాలల (AP Schools) వేసవి సెలవుల (Summer Holidays) క్యాలెండర్‌ను ప్రకటించింది.

Published By: HashtagU Telugu Desk
Schools Reopen

Schools Reopen

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2023 కోసం పాఠశాలల (AP Schools) వేసవి సెలవుల (Summer Holidays) క్యాలెండర్‌ను ప్రకటించింది. పాఠశాలలు మే 1వ తేదీ నుండి మూసివేయబడతాయి. జూన్ 12, 2023న తిరిగి తెరవబడతాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌. సురేష్‌ కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల విద్యా సంవత్సరం 2023-24 చివరి పనిదినం ఏప్రిల్ 30. జూన్ 12 (సోమవారం) అన్ని పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పునఃప్రారంభించే రోజు అని ప్రకటనలో పేర్కొన్నారు. మే 1 నుండి జూన్ 11 వరకు రాష్ట్రం లోని అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తూ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు విడుదల చేసింది.

Also Read: Tirumala Temple: తిరుమలలో ఒకేసారి మూడు హెలికాప్టర్ల చక్కర్లు కలకలం.. శ్రీవారి ఆలయం సమీపం నుంచే హెలికాప్టర్లు..!

ఈ విద్యా సంవత్సరానికి ఏప్రిల్ 30 చివరి పని తేదీగా పేర్కొంటూ పాఠశాల విద్యా కమిషనర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి రిపోర్టు కార్డులు ఇవ్వాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ సమావేశానికి తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరయ్యేలా అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు. 2023-24 విద్యా సంవత్సరానికి గాను జూన్ 12 నుంచి ఏపీలో మళ్లీ పాఠశాలలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.

  Last Updated: 26 Apr 2023, 12:39 PM IST