Site icon HashtagU Telugu

Minister Narayana : ఇళ్లు కట్టుకునేవారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

Narayana New Houses

Narayana New Houses

ఏపీ(AP)లో అధికారం చేపట్టిన కూటమి సర్కార్..ప్రజలకు వరుస తీపి కబుర్లు అందజేస్తూ ప్రజలను సంతోష పరుస్తుంది. ఓ పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ..మరోపక్క రాష్ట్ర అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. మరోపక్క ఐటీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సైతం వరుసగా విదేశీ పర్యటనలు చేస్తూ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆహ్వానిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటె..కొత్తగా ఇల్లు కట్టుకునే వారికీ మంత్రి నారాయణ (Minister Narayana) గుడ్ న్యూస్ అందించారు.

100 గజాల్లోపు ఇళ్ల నిర్మాణానికి ప్లాన్ పర్మిషన్ అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ నిర్ణయాన్ని త్వరలో అమల్లోకి తీసుకువచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా, 300 గజాల్లోపు ఇళ్లకు కూడా సులభంగా ప్లాన్ అనుమతులు పొందేలా పథకాలను రూపొందించడం జరుగుతున్నట్లు మంత్రి తెలిపారు. భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను పరిశీలించి, పేద, మధ్యతరగతి ప్రజలకు మరింత అనుకూలంగా ఉండేలా నూతన విధానాలను రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల నగరాల్లో నివాస సమస్యలను అధిగమించడానికి, అర్హులైన కుటుంబాలకు సౌకర్యవంతమైన ఇళ్లను నిర్మించుకునే అవకాశాలను కల్పించేందుకు దోహదం చేస్తాయని మంత్రి నారాయణ అభిప్రాయపడ్డారు.

Read Also : Massive Accident : ఛత్తీస్‌గఢ్‌ ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది మృతి