Site icon HashtagU Telugu

AP Sand Scam : హ‌వ్వా! ఇసుక‌లో న‌ష్ట‌మా? రూ. 40వేల కోట్ల మోసం గురూ.!

Ap Sand Scam

Ap Sand Scam

AP Sand Scam : ఇసుక కాంట్రాక్ట్ లో న‌ష్టం వ‌చ్చిదంటే న‌వ్వొస్తోంది. అదో పెద్ద జోక్ గా క‌నిపిస్తోంది. కానీ, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి జ‌మానాలో ఇసుక అమ్మ‌కాల్లో న‌ష్టం వ‌చ్చిన‌ట్టు చెప్ప‌డం రికార్ట్ బ్రేక్. ఇసుక పాల‌సీని మార్చ‌డ‌మే ప్ర‌స్తుత ప్ర‌భుత్వ తీరుకు అద్దం ప‌డుతోంది. రాష్ట్రంలోని ఇసుక రేవుల‌ను హోల్ సేల్ గా జ‌య‌ప్ర‌కాశ్ ప‌వ‌ర్ వెంచ‌ర్స్ కు అప్ప‌గించింది. ఆ కంపెనీ ప్ర‌భుత్వంలోని కొంద‌రు పెద్ద‌ల నీడ‌న న‌డుస్తుంద‌ని స‌ర్వ‌త్రా వినిపించే ఆరోప‌ణ‌. అందుకే, ఇసుక అమ్మ‌కాల్లో న‌ష్టం వ‌చ్చింద‌ని తేలిగ్గా చూపించ‌గ‌లిగారు. జీఎస్టీ రూపంలో ఆ కంపెనీ చేసిన ఫ్రాండ్ ను టీడీపీ బ‌య‌ట‌పెట్టింది.

ఇసుక రేవుల‌ను హోల్ సేల్ గా జ‌య‌ప్ర‌కాశ్ ప‌వ‌ర్ వెంచ‌ర్స్ కు (AP Sand Scam)

ఇటీవ‌ల టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏపీలోని ఇసుక అమ్మ‌కాల‌పై (AP Sand Scam)ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. ఆయ‌న లెక్క‌ల ప్ర‌కారం ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హ‌యాంలో రూ. 40వేల కోట్ల కుంభ‌కోణం జ‌రిగింది. దేశంలోనే ఇదో పెద్ద ఫ్రాండ్ గా ప్ర‌క‌టించారు. స‌రే, ఆయ‌న ప్ర‌తిప‌క్ష నేత‌గా ఏదో ఆరోప‌ణ‌లు చేశార‌ని కొట్టిపారేసినా.. జీఎస్టీ రూపంలో ఆ కంపెనీ వేసిన రిటర్న్స్ చూస్తే దాని అక్ర‌మాల భాగోతం బ‌య‌ట‌ప‌డుతుంది. ఇసుక త‌వ్వ‌కాలు, అమ్మ‌కాలు, జీఎస్టీ రిట‌ర్న్స్ మ‌ధ్య ఏ మాత్రం పొంత‌న లేకుండా జ‌య‌ప్ర‌కాశ్ ప‌వ‌ర్ కంపెనీ చిత్ర‌గుప్తుని లెక్క‌లు రాసింది.

రెండేళ్లలో రూ.107 కోట్ల నష్టం వ‌చ్చిన‌ట్టు చూపించ‌డం విచిత్రం

సాధార‌ణంగా ఏ కంపెనీ అయినా క్వార్ట‌ర్లీ రిపోర్ట్స్ ను ఇస్తుంది. కానీ, జ‌య‌ప్రకాశ్ ప‌వ‌ర్ కంపెనీ (AP Sand Scam)అందుకు విరుద్ధం. అంతేకాదు, కాంట్రాక్ట్ ప్ర‌కారం ఏపీ ప్రభుత్వానికి రెండేళ్లకు రూ.1528 కోట్లు చెల్లించాల్సిన జేపీ పవర్ వెంచర్స్ సంస్థ జీఎస్టీ రిటర్న్స్ లో రూ.1421 కోట్ల టర్నోవర్ చూపించింది. అంటే, రెండేళ్లలో రూ.107 కోట్ల నష్టం వ‌చ్చిన‌ట్టు చూపించ‌డం విచిత్రం. 2023 జనవరిలో కేవలం 43 వేల టన్నులు ఇసుక మాత్రమే అమ్మినట్టు, రూ.2కోట్ల ఆదాయమే వచ్చినట్టు జేపీ పవర్ వెంచర్స్ సంస్థ చూపించ‌డం హైలెట్‌. 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రానికిగాను 11 నెలలకు జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేయాల్సి ఉంటే, కేవ‌లం 5 నెలలకే ఫైల్ చేసింది. మిగిలిన 6 నెలలకు సున్నాలు పెట్టింది.

జీఎస్టీ రిటర్నులు ఫైల్  కేవ‌లం 5 నెలలకే (AP Sand Scam)

ఇక 2022-23లో 12నెలలకు గాను 10 నెలలే జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేసింది. ఏప్పిల్, ఆగస్ట్ నెలలకు సున్నాలు పెట్టింది. ఆ లెక్కన రెండేళ్ల కాలంలో ఎనిమిది నెల‌లు ఇసుక అమ్మలేదా? అంటే స‌మాధానం లేదు. ఇదే అంశంపై టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి కొన్ని లెక్క‌లు బ‌య‌ట‌కు తీస్తూ జేపీ ప‌వ‌ర్ సంస్థ‌కు ప్ర‌శ్న‌ల‌ను సంధించారు. రాష్ట్ర వ్యాప్తంగా జేపీ ప‌వ‌ర్ వెంచ‌ర్స్ పేరుతో ఇసుక అమ్మ‌కాల స‌మ‌యంలో బిల్లుల‌ను ఇస్తున్నారు. అందుకు సంబంధించిన ప‌న్నులు, జీఎస్టీ చెల్లిస్తున్నారా? అంటే ప్ర‌భుత్వం (AP Sand Scam) నుంచి స‌మాధానం లేక‌పోవ‌డంతో గ‌మ‌నార్హం.

2022-23లో 12నెలలకు గాను 10 నెలలే జీఎస్టీ రిటర్నులు ఫైల్

రాష్ట్రంలోని ఇసుక అక్ర‌మాల‌పై టీడీపీ సేక‌రించిన వివ‌రాల ప్ర‌కారం 2021-22 ఆర్థిక సంవత్సరంలో జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ అవుట్ వర్డ్ టాక్స్ బుల్ సప్లైస్ కింద చూపించిన టర్నోవర్ రూ.637,65,65,192లు (ఆరువందల ముప్పై ఏడుకోట్ల అరవై ఐదు లక్షల అరవై ఐదువేల నూట తొంబైరెండు రూపాయలు). అలానే 2022-23 సంవత్సరంలో చూపిన టర్నోవర్ రూ.783,72,55,114లు (ఏడు వందల ఎనభై మూడుకోట్ల డెబ్బై రెండు లక్షల యాభై ఐదువేల నూట పద్నాలుగు).

Also Read : CBN Social Media : పొత్తు కోసం చంద్ర‌బాబుపై ఐటీ ప్ర‌యోగం?

జేపీ పవర్ వెంచర్స్ సంస్థ జీఎస్టీ రిజిస్ట్రేషన్ నంబర్ 37AAA CJ 6297K1Z0. ఈ నెంబర్ ద్వారా ఆ కంపెనీ రెండేళ్లకు చూపిన మొత్తం టర్నోవర్ రూ.1421,38,20, 306లు (పద్నాలుగు వందల ఇరవై ఒక్క కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ఇరవై వేల మూడు వందల ఆరు). ఇసుకతవ్వకాలకు సంబంధించి రెండేళ్లకు ఆ కంపెనీ ఏపీ ప్రభుత్వానికి చెల్లిస్తామన్న సొమ్ము రూ.1528.80 కోట్లు. కానీ వాళ్లు చూపించిన టర్నోవర్ రూ.1421.38 కోట్లు. ఈ లెక్కన జయప్రకాశ్ పవర్ వెంచర్స్ ఇసుక వ్యాపారం ద్వారా రెండేళ్లలో రూ.107కోట్లు నష్టపోయింద‌ని జీఎస్టీ లెక్కలు చెబుతున్నాయి. అంటే రెండేళ్లలో ఇసుక వ్యాపారం చేసి రూ.107 కోట్లు ఆ కంపెనీ నష్టపోయిందంటే న‌మ్మేవాళ్లు ఎవ‌రు? అనేది జ‌గ‌న్ స‌ర్కార్  (AP Sand Scam)గ్ర‌హించాలి.

ఇసుకతవ్వకాలు  సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిందనేది ప‌చ్చినిజం

2021 మే నెలలో రాష్ట్రంలో ఇసుక తవ్వకాల టెండర్ దక్కించుకున్న జయప్రకాశ్ పవర్ వెంచర్స్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో 11 నెలలకు జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేయాలి. కానీ, 5 నెలలకే ఫైల్ చేసింది. మిగిలిన 6 నెలలకు సున్నాలు పెట్ట‌డం గ‌మ‌నార్హం. 2021 మే, జూన్, జులై, ఆగస్ట్..2022 జనవరి, ఫిబ్రవరి నెలలకు కూడా సున్నాలు పెట్టారు. 2022-23లో 12నెలలకు గాను 10 నెలలే జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేశారు. ఏప్రియల్, ఆగస్ట్ నెలలకు సున్నాలు పెట్టారు. సంవత్సరంలో 12 నెలలు, 365 రోజులు విచ్చలవిడిగా ఇసుక అమ్మకాలు (AP Sand Scam) జరుపు తూ, ఈ విధంగా సున్నాలు పెట్టించ‌డం ఆ కంపెనీలోని బినామీ పెద్ద‌ల‌కే చెల్లింది.

Also Read : AP CM Jagan Alternative Plan : ఆర్ 5 జోన్ విషయంలో జగన్ ముందున్న ప్రత్యామ్నాయం ఏంటి?

2023 జనవరిలో జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ కేవలం 43,506 టన్నుల ఇసుకమాత్రమే అమ్మినట్టు, రూ. 2,06,65,476ల టర్నోవర్ మాత్రమే వచ్చినట్టు చెప్పడం విచిత్రాలకే విచిత్రం. 2021-22 మరియు 2022-23 సంవత్సరాల్లో వివిధ నెలల్లో జయప్రకాశ్ పవర్ వెంచర్స్ చూపించిన టర్నోవర్ ప్రజల్ని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఉదాహరణకు 2021 నవంబర్లో కేవలం రూ.58కోట్ల టర్నోవర్ మాత్రమే ఇసుక అమ్మకాల ద్వారా రాష్ట్రంలో సాధించినట్టు, అదే సంవత్సరం సెప్టెంబర్లో కేవలం రూ.62.9కోట్లు మాత్రమే ఇసుక అమ్మకాలు (AP Sand Scam)  జరిగినట్టు జీఎస్టీ రిటర్నుల్లో పేర్కొనడం విడ్డూరం.

జీఎస్టీ రిటర్న్స్ లో ఇన్ వోర్డ్ సప్లైస్ అనే కాలమ్ 

ఇంకా ఘోరం ఏమిటంటే 2023 జనవరిలో ఇసుక అమ్మకాలు అతి తక్కువగా రూ.2,06,65,476లు మాత్రమే జ‌రిగిన‌ట్టు ఆ కంపెనీ చూపించింది. అంటే టన్ను రూ.475 చొప్పున లెక్కగడితే కేవలం 43,506 టన్నులు మాత్రమే ఇసుక అమ్మకాలు జరిగాయని చెప్పడం విచిత్రాల‌కే విచిత్రం. జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ ఫైల్ చేసిన జీఎస్టీ రిటర్న్స్ లో ఇన్ వోర్డ్ సప్లైస్ అనే కాలమ్ కూడా మెన్షన్ చేశారు. ఇతరుల నుంచి రూ.1372 కోట్ల విలువైన ఇసుక కొనుగోలు చేసినట్టు చూపించారు. 2021-22లో రూ.725 కోట్లు, 2022-23లో రూ.647 కోట్లు మొత్తంగా రూ.1372కోట్లకు కొనుగోలు చేశామని రికార్ట్ ల్లో ఎక్కించారు. అంటే ఆ సంస్థ ఇసుకతవ్వకాలు మరో సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిందనేది ప‌చ్చినిజం. సబ్ కాంట్రాక్ట్ సంస్థ తవ్వకాలు జరిపితే దాని నుంచి జేపీసంస్థ (AP Sand Scam) ఇసుక కొనుగోళ్లు జరిపినట్టు వ్యవహారం న‌డిచింది.

Also Read : TDP Manifesto: చంద్రబాబు దూకుడు.. దసరాకు టీడీపీ మేనిఫెస్టో!

జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ రెండేళ్లలో చూపించిన టర్నోవర్ రూ.1421.38 కోట్లు మాత్రమే. అంటే కేవలం 2కోట్ల 99 లక్షల టన్నుల ఇసుక మాత్రమే అమ్మినట్టు చూపారు. అంటే సంవత్సరానికి కోటిన్నర టన్నులు కూడా అమ్మలేదంటున్నా రు. మంత్రి పెద్దిరెడ్డి మాత్రం సంవత్సరానికి తక్కువలో తక్కువగా రూ. 2 కోట్ల టన్నులు ఇసుక అమ్మకాలు రాష్ట్రంలో జరుగుతున్నట్టు చెబుతున్నారు. ఈ లెక్క‌న జేపీ ప‌వ‌ర్ సంస్థ రికార్డుల‌ను న‌మ్మాలా? మంత్రి పెద్ది రెడ్డి మాట‌లు విశ్వ‌సించాలా? అనేది ఏపీ ప్ర‌జ‌ల్లోని సందేహం.

అక్రమ ఇసుకతవ్వకాలపై సీబీఐ విచారణ జరగాల‌ని టీడీపీ డిమాండ్ (AP Sand Scam)

వాస్తవానికి చంద్రబాబు చెప్పినట్టు ప్రతిసంవత్సరం పది కోట్ల టన్నుల ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. భారీ యంత్రాలతో ఇష్టానుసారం రీచ్ లలో కోట్ల టన్నుల ఇసుక తవ్వకాలు జరపుతోన్న విష‌యాన్ని గ్ర‌హించిన‌ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ 110 రీచ్ లలో ఇసుక తవ్వకాలు నిలిపేయాలని ఆదేశించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు జయప్రకాశ్ పవర్ వెంచర్స్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్, జీఎస్టీ రిటర్న్స్ సహా రాష్ట్రంలో కొన్ని వందల రీచ్ లలో జరుగుతున్న అక్రమ ఇసుకతవ్వకాలపై (AP Sand Scam) తక్షణమే సీబీఐ విచారణ జరగాల‌ని టీడీపీ డిమాండ్ చేస్తోంది.