AP : ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సస్పెండ్

వైసీపీ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయడం తో ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది.

Published By: HashtagU Telugu Desk
Ap Sachivalayam Employees A

Ap Sachivalayam Employees A

ఏపీలో మొన్నటి వరకు ఓ లెక్క..ఇప్పుడు ఓ లెక్కలా మారింది. రెండు నెలల క్రితం వరకు అధికార పార్టీ వైసీపీ ఆడిందే ఆట..పాడిందే పాటలా సాగింది. కానీ ఇప్పుడు ఎక్కడిక్కడే వారి ఆటలను కట్ చేస్తున్నారు ఈసీ. ఎన్నికల విషయంలో ఈసీ చాల కఠినంగా వ్యవహరిస్తోంది. అధికార పార్టీ ఆగడాలపై ఎప్పటికప్పుడు డేగ కన్ను వేస్తూ ఉంది. ఇప్పటికే వైసీపీ ఆగడాలకు చెక్ పెడుతూ వస్తున్నా ఈసీ..తాజాగా మరో షాక్ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు (Sachivalayam Employees Association Leader ) వెంకట్రామిరెడ్డి (Venkatrami Reddy)పై ఎన్నికల సంఘం (EC) సస్పెన్షన్ (Suspension ) వేటు వేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. YSR జిల్లా బద్వేలులో RTC ఉద్యోగులతో ఆయన భేటీ నిర్వహించారు. వైసీపీ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయడం తో ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. దీంతో వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేసింది. హెడ్క్వార్టర్స్ దాటి వెళ్లొద్దని వెంకట్రామిరెడ్డిని EC ఆదేశించింది. ఇతడు మాత్రమే కాదు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అధికార పార్టీకి మద్దతు పలుకుతూ వస్తున్న వారిపై కొరడా దులిపిస్తూ వస్తుంది. అలాగే ఎలాగైనా గెలవాలనే ఉద్దేశ్యంతో ఓటర్లను చీరలు , నగదు తదితర వస్తువులతో ఆశచూపుతున్న వారిపై కూడా నిఘా పెట్టింది ఈసీ. ఇప్పటికే పలు చోట్లా దాడులు జరిపి పెద్ద ఎత్తున చీరలు , గోడ గడియారాలు తదితర వాటిని సీజ్ చేసారు.

ఇక ఈరోజు నుండి ఏపీలో నామినేషన్ల పర్వం మొదలుకావడం తో ఈసీ మరింత ఫోకస్ పెట్టింది. పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారే అవకాశం ఉండడం తో పోలీసులను మరింతగా అప్రమత్తం చేసింది.

Read Also : Lok Sabha Polls : లోక్ సభ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసిన కేసీఆర్

  Last Updated: 18 Apr 2024, 09:23 PM IST