Site icon HashtagU Telugu

AP Roads : సీఎం జగన్ కు వర్షాలు మరో తలనొప్పి తెచ్చిపెట్టాయి

People Fires on CM Jagan

People Fires on CM Jagan

సీఎం జగన్ (CM Jagan) కు ఇప్పుడు వర్షాలు పెద్ద తలనొప్పిగా మారాయి. అదేంటి అనుకుంటున్నారా..? రాష్ట్రంలో రోడ్ల (AP Roads) పరిస్థితి ఎలా ఉందనేది కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. వైస్సార్సీపీ అధికారం చేపట్టిన దగ్గరి నుండి కూడా ప్రజలు రోడ్లు బాగు చేయాలనీ కోరుతున్నారు. గల్లీ రోడ్లే కాదు మెయిన్ రోడ్లు సైతం దారుణంగా ఉన్నాయి. గత ఏడాది వర్ష కాల (Rainy Season) సమయంలో పెద్ద ఎత్తున రోడ్ల విషయంలో ప్రజలు ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో ఉన్న డబ్బుతో అక్కడక్కడా రోడ్లు వేసి చేతులు దులుపుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ వర్షాలు మొదలుకావడం తో ఎక్కడ చూసిన రోడ్లు గుంతలతో దర్శనం ఇస్తున్నాయి. రోడ్ల ఫై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేయాల్సి వస్తుంది.

తాజాగా ఏలూరు లో రోడ్ల పరిస్థితిపై ఓ యువకుడు వినూత్న నిరసన చేపట్టాడు. రోడ్డుపై నీళ్లు నిలిచి ఉన్న గుంతలో నవారు మంచం వేసుకుని యువకుడు (Young Man) నిరసన తెలిపాడు. దీంతో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు గంటసేపు ఆగిపోయింది. తర్వాత ఆర్టీసీ డ్రైవర్, స్థానికులు నచ్చచెప్పడంతో యువకుడు వెనక్కి తగ్గాడు. రోడ్డుకు మరమ్మత్తులు చేయించాలని లేదా నూతన రోడ్డు నిర్మించాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వినలేదని, అందుకే అందరికీ తెలిసేందుకు ఇలా చేసినట్లు యవకుడు తెలిపాడు. కేవలం ఏలూరు లో మాత్రమే కాదు రాష్ట్రంలో రోడ్లన్నీ ఇలాగే ఉన్నాయని ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. రోడ్లు బాగుచేయాలని ప్రభుత్వాన్ని పదే పదే కోరుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదని వారంతా వాపోతున్నారు.

ఇప్పటికే సీఎం జగన్ అనేక సమస్యలతో ఫ్రస్టేషన్ లో ఉన్నాడు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ,,వైస్సార్సీపీ పార్టీ ని గద్దె దించాలని చూస్తున్నాయి. ప్రజల్లోనూ అధికార పార్టీ ఫై వ్యతిరేకత ఉంది. వీటి నుండి ఎలా బయటపడేలా అని జగన్ ఆలోచిస్తుంటే..ఇప్పుడు వర్షాల వల్ల రోడ్లు దారుణంగా మారాయి. ప్రతిపక్షాలకు మరో ఆయుధంలా రోడ్ల దొరికాయి. మరి జగన్ ఏంచేస్తారో…రోడ్లు వేస్తారా..లేక అలాగే వదిలేస్తారా..? అనేది చూడాలి.