AP Results 2024: కౌటింగ్ కి ఇంకా కొన్ని నిమిషాలే మిగిలి ఉన్న వేళా టీడీపీ ఎలక్షన్ ఏజెంట్ గుండెపోటుకు గురయ్యాడు. పల్నాడు జిల్లా చిలకలూరి పేట టీడీపీ ఏజెంట్ రమేష్ గుండెపోటుకు గురయ్యాడు. నర్సరావుపేట జేఎన్టీయూ లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో రమేష్ ఒక్కసారిగా స్పృహ తప్పిపోయాడు. వెంటనే అతనిని అంబులెన్సులో స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా స్పందించిన ఎన్నికల కమిషన్, రమేష్ స్థానంలో మరో టీడీపీ ఏజెంటును నియమించింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచి సీఎం పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు ముగిసి చాలా రోజులు అవుతుంది. అయితే పోలింగ్, కౌంటింగ్ మధ్య గ్యాప్ ఎక్కువ కావడంతో ప్రజల్లోనూ ఆసక్తి పెరిగింది. ఈ సారి టీడీపీ, వైసీపీ మధ్య రసవత్తర పోరు సాగింది. జనసేన అధినేత తోడవ్వడంతో టీడీపీ బలం పెరిగింది. అటు పొత్తులో భాగంగా బీజేపీ కూడా ఉండటంతో ఎన్డీయే కూటమి విజయం సాదిస్తుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి.
మరోవైపు ఈ సారి భారీగా ఓటింగ్ పాలైంది. విదేశాల నుంచి వచ్చి మరీ ఓటేశారు. దీంతో వైసీపీపై అసంతృప్తి కారణమని టీడీపీ విమర్శిస్తోంది. ఇక ఏపీలో విజయంపై రాజకీయ విశ్లేషకులకు కూడా అంతుబట్టకుండా ఉంది. కానీ ప్రధాన రాజకీయ పార్టీలు టీడీపీ, వైసీపీ తమదే విజయమంటూ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. లోలోపల మాత్రం టెన్షన్ పడుతున్నాయి.
Also Read: AP Election Results : పోస్టల్ బ్యాలెట్ తో ఎవరు విజయం సాదించబోతున్నారో తెలియబోతుందా..?