AP Results 2024: ఎట్టకేలకు టీడీపీ ఖాతాలో తొలి విజయం నమోదైంది. 175 స్థానాలకు గానూ తొలి ఫలిత వెల్లడైంది. టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య తొలి విజయం సాధించారు. రాజమండ్రి రురల్ లో పోటీ చేసిన ఆయన 50 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. అటు ఎన్డీయే కూటమి గెలుపు దిశగా పయనిస్తుంది. ఈ క్రమంలోఎన్డీయే కూటమికి, వైసీపీ పార్టీకి మధ్య వ్యత్యాసం చాలా ఉంది. ఇక జనసేన 18 స్థానాల్లో ప్రభంజనం సృష్టిస్తుంది. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే సంబరాలు మొదలయ్యాయి. టీడీపీ, మరియు దాని భాగస్వామి పార్టీలు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్దకు భారీగా కార్యకర్తలు వచ్చి కోలాహలం చేస్తున్నారు. దర్శకుడు బోయపాటి చంద్రబాబుని కలిసేందుకు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.
AP Results 2024: ఖాతా తెరిచిన టీడీపీ

AP Results 2024