AP Results 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం అందుకుంది. గత ఎన్నికల్లో 175 స్థానాలకు గానూ 151 సీట్లు కైవసం చేసుకున్న వైఎస్ జగన్ ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. 175 స్థానాలకు గానూ వైసీపీ పార్టీ 20 సీట్లు గెలుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇదిలా ఉండగా కుప్పం నుంచి చంద్రబాబు, మంగళగిరి నుంచి లోకేష్, పిఠాపురం నుంచి జనసేన అధినేత, హిందూపూర్ నుంచి బాలకృష్ణ భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయం పురస్కరించుకుని చంద్రబాబు ఇంట్లో సంబరాలు అంబరాన్నంటాయి.
కూటమి ఘన విజయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో సంబరాలు జరిగాయి. నారా, నందమూరి కుటుంబ సభ్యులు, బంధువులు కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి మనవడు దేవాన్ష్ కేక్ కట్ చేసి తాతకు, బంధువులకు కేక్ తినిపించారు. దీనికి సంబందించిన ఫోటోలు, వైరల్ గా మారాయి.
Also Read: AP & TG Election Results Live Updates : పులివెందులలో జగన్ విజయం