AP Results 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరియు పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికల ఫలితాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడి పోటీ చేయగా, వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగింది. ఈ రోజు ఎన్నికల కౌటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ శ్రేణులు తమ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే టీడీపీ ముందంజలోనే కొనసాగుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది.టీడీపీ 81 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తుంది. జనసేన 15 స్థానాల్లో ముందజంలో ఉండగా, బీజేపీ 5 స్థానాల్లో కొనసాగుతుంది. అయితే అధికార పార్టీ వైసీపీ మాత్రం 14 స్థానాల్లో కొనసాగుతుండటం గమనార్హం. లోకసభ స్థానాల్లో టీడీపీ 11, జనసేన 1, బీజేపీ 5, వైసీపీ 2 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇదిలా ఉండగా వైసీపీ నేతలైన రోజా, విడుదల రజిని, బుగ్గన, అంబటి, చెల్లబోయిన, పెద్దిరెడ్డి, జోగి రమేష్, గుడివాడ అమర్‌నాథ్, దాడిశెట్టి రాజా, బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి కొడాలి నాని వెనుకంజలో ఉన్నారు.
ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో అధికార మార్పిడికి రంగం సిద్ధమైంది. వైసీపీ ఓటమి దిశగా పయనిస్తుంది. కాగా ఎన్డీయే కూటమి విజయం దాదాపు ఖాయమైన నేపథ్యంలో మరికాసేపట్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ కానున్నారు. తదుపరి కార్యాచరణపై ఇదరూ పార్టీల నేతలు చర్చించనున్నారు.
Also Read: AP Results 2024: మ్యాజిక్ ఫిగర్‌ను దాటిన ఎన్డీఏ కూటమి..ఆధిక్యంలో టీడీపీ