Urdu: ఏపీలో రెండో అధికారిక భాష‌గా ఉర్దూ!

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

  • Written By:
  • Publish Date - June 18, 2022 / 06:45 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రెండో అధికారిక భాష‌గా ఉర్దూను ప్ర‌క‌టిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ అధికార భాషల చట్టం సవరణ-2022లో చేసిన మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయని పర్యాటక, సాంస్కృతిక, యువజన వ్యవహారాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. గత మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఉర్దూకు రెండో అధికార భాష హోదా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 15 జిల్లాల్లో ఉర్దూ రెండవ అధికార భాషగా కొనసాగింది. విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఉర్దూను రెండవ అధికార భాషగా చట్టబద్ధం చేసింది. మైనారిటీలు, ఉర్దూ ప్రియుల ఆకాంక్షలను గుర్తించిన సీఎం జగన్మోహ‌న్ రెడ్డి ఉర్దూను రెండో అధికార భాషగా మార్చారు. దీనితో, రాష్ట్ర ప్రభుత్వం అధికారిక కార్యకలాపాలను నిర్వహించడానికి ఉర్దూకు సమాన హోదాను ఇచ్చింది. ఉత్తరాలు మరియు ప్రత్యుత్తరాలు రాయడంలో కూడా — తెలుగుతో పాటు ఉర్దూలో ఉండేలా ఏపీ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. డిప్యూటీ సీఎం అంజాత్ బాషా మాట్లాడుతూ ఉర్దూ ప్రజలందరి భాష అని, గత ప్రభుత్వాలు ఉర్దూ అభివృద్ధిని విస్మరించాయన్నారు. ఉర్దూ భాషకు రెండో అధికార భాష హోదా కల్పించడం ద్వారా జగన్ దానికి ఊతం ఇస్తున్నారని ప్ర‌శంసించారు.