Physical Harassment : రోజు రోజుకు మృగాళ్లు రెచ్చిపోతున్నారు. కామవాంఛ తీర్చుకోవడానికి కన్నుమిన్ను కానకుండ ప్రవర్తిస్తున్నారు. అన్నపుణ్యం తెలియని చిన్నారుల జీవితాలను బలిగొంటున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన వెలుగు చూసింది. విద్యాబుద్ధులు నేర్పి, భావి పౌరులను తీర్చిదిద్దాల్సిన ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్, మైనర్ బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. ఈ షాకింగ్ ఘటన మండపేట నియోజకవర్గంలోని రాయవరం మండలం, మాచవరం గ్రామంలో చోటుచేసుకుంది.
సుమారు నాలుగు నెలల క్రితం, అదే పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ప్రిన్సిపాల్ జయరాజు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో, భయపడిన ఆ బాలిక ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పలేకపోయింది. ఇదే అదునుగా భావించిన ప్రిన్సిపాల్ జయరాజు, ఆ విద్యార్థినిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
Nimisha Priya : యెమెన్‌లో నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దు.. భారత ప్రభుత్వ కృషికి ఫలితం
ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థినికి మూడు నెలలుగా పీరియడ్స్ రాకపోవడంతో, తల్లిదండ్రులు ఆందోళన చెంది ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి, ఆ బాలిక గర్భవతి అని నిర్ధారించడంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. తమ కుమార్తెకు జరిగిన దారుణాన్ని తెలుసుకుని వారు లబోదిబోమన్నారు.
వెంటనే బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు రాయవరం పోలీస్ స్టేషన్‌లో ప్రిన్సిపాల్ జయరాజుపై ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రాయవరం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణానికి పాల్పడిన ప్రిన్సిపాల్ జయరాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
N Jagadeesan: రిషబ్ పంత్ స్థానంలో జగదీశన్.. అతని కెరీర్ ఎలా ఉందంటే?