AP Election Results : పోస్టల్ బ్యాలెట్ తో ఎవరు విజయం సాదించబోతున్నారో తెలియబోతుందా..?

గత ఎన్నికల ప్రచారంలో ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక హామీలను మరచిపోవడం..మాట మార్చడం చేసేసరికి జగన్ ఫై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు

Published By: HashtagU Telugu Desk
Postel Votes

Postel Votes

నరాలు తెగే ఉత్కంఠ కు మరికాసేపట్లో తెరపడబోతుంది. ఏపీ ప్రజలు ఎవరికీ పట్టం కట్టారో..? ఏ పార్టీని విజయ అంచుల్లోకి తీసుకెళ్లారో..? ఏ అభ్యర్ధికి ఎంత మెజార్టీ ఇచ్చారో..? తెలియబోతుంది. రాష్ట్రవ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్‌ హాళ్లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సీట్ల కోసం 2,446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్‌ బ్యాలెట్‌ టేబుళ్లు ఏర్పాటు చేశారు. 4.61 లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్నారు. 26,473 మంది ఓటర్లు హోమ్‌ ఓటింగ్‌ విధానం ద్వారా ఓటు వేశారు. మరో 26,721 మంది సర్వీసు ఓటర్లు కూడా ఎలక్ట్రానిక్‌ విధానంలో ఓటు వేయడం జరిగింది. వీటిలో ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తారు. ఈ ఓట్ల లెక్కింపు ఫలితంతో రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారో అనేది తెలియనుంది.

We’re now on WhatsApp. Click to Join.

పోస్టల్ బ్యాలెట్ అనేది ఉద్యోగం కారణంగా తమ నియోజకవర్గంలో ఓటు వేయలేని వ్యక్తులు దీనిని ఎన్నికల్లో ఉపయోగిస్తారు. దీనిని ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ (ETPBS) అని కూడా అంటారు. ఓటరు తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసిన తర్వాత ఈ పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల కమిషన్ అధికారికి పోస్ట్ ద్వారా లేదా ఎలక్ట్రానిక్ పద్ధతిలో తిరిగి పంపబడుతుంది.

ఈ పోస్టల్ ఓట్ అనేది దేశ సైనికుడు, ఎన్నికల విధుల్లో నిమగ్నమైన ఉద్యోగులు, దేశం వెలుపల పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులు, నిర్బంధంలో నివసిస్తున్న వ్యక్తులు (ఖైదీలకు ఓటు హక్కు లేదు), 85 ఏళ్లు పైబడిన ఓటర్లు (గతంలో 80 ఏండ్లు పైబడినవారికి అవకాశం ఉండేది), వికలాంగులు (రిజిస్టర్ చేసుకోవాలి) వంటి వారు వేస్తారు. ఈసారి ఏపీలో కూడా పెద్ద ఎత్తున పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వేయడం జరిగింది. అయితే ఈసారి ఉద్యోగులు కూటమికే తమ ఓటును వేశారని తెలుస్తుంది. దీనికి కారణాలు కూడా జగనే. గత ఎన్నికల ప్రచారంలో ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక హామీలను మరచిపోవడం..మాట మార్చడం చేసేసరికి జగన్ ఫై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ ఆగ్రహమే ఓట్లు రూపంలో చూపించారని తెలుస్తుంది. వారి ఆగ్రహం ఏ రేంజ్ లో ఉందనేది మరికాసేపట్లో తేలనుంది.

Read Also : AP Results 2024: జగన్ అడ్డాలో ఈ సారి టీడీపీ రాణించేనా ?

  Last Updated: 04 Jun 2024, 07:49 AM IST