AP Polling : ఏపీలో 3గం ల వరకు 55 శాతం పోలింగ్

  • Written By:
  • Publish Date - May 13, 2024 / 04:04 PM IST

ఏపీలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కొన్ని చోట్ల పలు ఉద్రిక్తతలు జరిగినప్పటికీ ఓటర్లు మాత్రం పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈసారి పోలింగ్ శాతం రికార్డు నమోదు కాబోతున్నట్లు తెలుస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఓటర్లు పోటెత్తారు. ఉదయం 07 నుండే పోలింగ్ కేంద్రాలకు భారీగా ఓటర్లు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడం..సాంకేతిక సమస్యలు వచ్చినప్పటికీ , టెక్నీకల్ టీమ్ వాటిని సరిచేయడం తో అవి వర్క్ అవుతున్నాయి. ప్రస్తుతం మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 55 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.

ఉదయం 9 వరకు 9.21 శాతం పోలింగ్‌ నమోదు కాగా 11 గంటల వరకు 23 శాతం ఓటింగ్​ నమోదయ్యింది. మధ్యాహ్నం 1గంట వరకు 40.26శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోలింగ్​ శాతం మధ్యాహ్నం 3గంటలకు 55 శాతానికి పెరిగింది. ఇప్పటి వరకు 1.70 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా కడప జిల్లాలో 45.5 శాతం మేర పోలింగ్ నమోదైంది. తర్వాత స్థానాల్లో కృష్ణా, కోనసీమ, చిత్తూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 32.80 శాతం పోలింగ్ నమోదైంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇతర ప్రాంతాలలో ఇప్పటివరకు నమోదైన పోలింగ్ శాతం ఇలా ఉంది.

అల్లూరి 32.80 , అనకాపల్లి 37, అనంతపురం 39.82, అన్నమయ్య 39.60, బాపట్ల 44.45, చిత్తూరు 44.50, కోనసీమ 44.03, తూ.గో 38.54, ఏలూరు 38.76, గుంటూరు 40.12, కాకినాడ 38.25, కృష్ణా 44.50, కర్నూలు 38, నంద్యాల 44.20,ఎన్టీఆర్ 39.60, పల్నాడు 40.53, పార్వతిపురం మన్యం 34.87, ప్రకాశం 42.78, నెల్లూరు 42.38, సత్యసాయి 38.10, శ్రీకాకుళం 40.56, తిరుపతి 39.14, విశాఖ 33.72, విజయనగరం 40.30, ప.గో 39.50, కడప 45.56 శాతం నమోదైంది.

ఏపీలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 2.3 కోట్ల మంది కాగా.. మహిళలు 2.10 కోట్ల మంది ఉన్నారు. అలాగే.. థర్డ్ జెండర్ వారు 3,421 మంది ఉన్నారు. ఇంకా.. సర్వీస్ ఓటర్లు 38,185 మంది ఉన్నారు. 10 లక్షల మంది యువ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. గతంలో 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 79.84 శాతం మేర పోలింగ్ నమోదు కాగా.. ఈసారి 83 శాతం మేర పోలింగ్ జరగబోతున్నట్లు తెలుస్తుంది.

Read Also : Sonia Gandhi : ప్రతి పేద మహిళకు రూ.1లక్ష లభిస్తాయి.. సోనియా గాంధీ