Site icon HashtagU Telugu

AP Polling : ఈసారి ఏపీలో పోలింగ్ శాతం పెరగనుందా..?

Chalo Ap

Chalo Ap

అంటే ఖచ్చితంగా అనే చెప్పాలి. ఎందుకంటే రెండు రోజుల ముందు నుండే ఏపీకి ప్రజలు బారులు తీరారు. బస్టాండ్ , రైల్వే స్టేషన్ , ఆఖరికి ఎయిర్ పోర్ట్ లు సైతం జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఉద్యోగ, ఉపాధి కోసం ఇక్కడ ఉండి ఐదేళ్లకోసారి తమకు ఇష్టమైన నాయకున్ని ఎన్నుకునేందుకు ఉత్సాహంగా సొంతూళ్లకు కదులుతున్నారు. ఈ క్రమంలో చాలామంది ఓటర్లు ప్రత్యేక బస్సులు, రైళ్లలో ఊర్లకు చేరుకుంటుండగా.. ఇంకొందరు తమ సొంత వాహనాల్లోనే స్వస్థలాలకు బయలుదేరారు. కేవలం హైదరాబాద్ , చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్న వారే కాదు..ఇతర కంట్రీలలో ఉన్న ఏపీ వాసులు సైతం సొంతర్లకు వస్తున్నారంటే అర్ధం చేసుకోవాలి ఈసారి ఓటు వేసేందుకు ఎంత ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసేందుకు వెళ్తున్నాం..మార్పు తీసుకొస్తాం..ఏపీని బాగుచేస్తాం..మా నేల కోసం వస్తున్నాం అంటూ చెపుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ నియోజకవర్గాలకు మే 13 న ఎన్నికలు జరుగుతుండగా.. ఎన్నికల అధికారులు సైతం ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేసారు. ఈసారి ఎన్నికల హోరు కూడా గట్టిగా ఉంది. ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా బరిలో నిలిచాయి. గ్రామాలు, పట్టణాల్లోని యువత, మహిళలు ఎక్కువగా ఓటింగ్ వైపు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సంఘం సైతం ఓటింగ్ పర్సంటేజ్ పెరిగేలా విస్తృత అవగాహన కల్పిస్తోంది. అటు, అభ్యర్థులు సైతం ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని సూచిస్తున్నారు. దీనికి తోడు తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా ఎండ, వడగాలుల తీవ్రత తగ్గి.. వాతావరణం చల్లబడింది. ఈ నేపథ్యంలో గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుందని అంతా భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో 79.64 శాతం పోలింగ్ జరిగితే.. ఈసారి 80 శాతం దాటి ఓటింగ్ జరగనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోపక్క పోస్టల్ ఓటింగ్ శాతం కూడా రికార్డు స్థాయిలో జరిగిందని ఇప్పటికే అధికారులు తెలుపడం తో..ఎల్లుండి ఏ రేంజ్ లో పోలింగ్ శాతం జరుగుతుందో…ఎవరికీ ఓటు వేస్తారో అని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Also : Nandyala : అల్లు అర్జున్ కేసు నమోదు…