AP Poll : వైసీపీ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్న సర్వేలు..

ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు చాలామంది ఓటమి పాలవుతున్నారని సర్వేలు చెపుతుండడం తో వారిలో ఖంగారు మొదలవుతుంది

  • Written By:
  • Publish Date - May 6, 2024 / 05:38 PM IST

ఏపీలో ఎన్నికల పోలింగ్ (AP Elections) కు ఇంకా వారం రోజుల సమయం కూడా లేదు. దీంతో అధికార – ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఇదే క్రమంలో పలు సర్వే (Survey)లు సోషల్ మీడియా లో వైరల్ అవుతూ..అధికార – ప్రతిపక్ష అభ్యర్థులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు చాలామంది ఓటమి పాలవుతున్నారని సర్వేలు చెపుతుండడం తో వారిలో ఖంగారు మొదలవుతుంది. ఎక్కువ సంఖ్యలో సర్వేలన్నీ కూటమికి అనుకూలంగా ఉండడం తో కూటమి నేతలు సంతోషం వ్యక్తం చేస్తుంటే..వైసీపీ నేతలు మాత్రం ఇవన్నీ ఫేక్ సర్వేలు అని చెపుతూనే లోలోపల మాత్రం భయపడుతున్నారు. కేవలం ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేదే కాకుండా.. నియోజకవర్గాలవారీ ఓట్ల శాతాన్ని సైతం ప్రచారం చేస్తున్నారు. పురుషులు, మహిళలు, వ్యవసాయదారులు, యువత, విద్యార్థులు ఇలా వర్గాలవారీ ఎవరు ఎవరికి మద్దతు ఇస్తున్నారనే అంశాలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అంత మాట్లాడుకునేలా చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

పయోనీర్స్ ప్రీపోల్ సర్వే చూస్తే..

ఏప్రిల్ ఒకటి నుంచి 31 మధ్య ఈ సర్వే చేసినట్లు రిపోర్టులో తెలిపారు. 25 లోక్‌సభ, 175 శాసనసభ స్థానాల్లో సర్వే చేయగా.. ఒక్కో శాసనసభ నియోజకవర్గం పరిధిలో 400 నుంచి 500 శాంపిల్స్ సేకరించామని, కంప్యూటర్ అసిస్టెడ్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారా ఈ సర్వే చేసినట్లు తెలిపారు. సీట్ల పరంగా ఎన్డీయే కూటమి 119 అసెంబ్లీ, 19 లోక్‌సభ సీట్లలో గెలిచే అవకాశం ఉండగా..వైసీపీ 46 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే రిపోర్టులో తెలిపింది. 10 శాసనసభా స్థానాల్లో గట్టి పోటీ ఉండబోతుందని, ఓట్ల శాతానికి సంబంధించి అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీయేకు 49 శాతం, వైఎస్సార్‌సీపీకి 41 శాతం, ఇండియా కూటమికి 3 నుంచి 4 శాతం, ఇతరులకు 1 నుంచి 2 శాతం ఓట్లు రావొచ్చని, 4 నుంచి 5 శాతం ఇప్పటికీ ఎటూ తేల్చుకోలేని ఓటర్లు ఉన్నారని పేర్కొంది.

ఐప్యాక్ ఫైనల్ సర్వే చూస్తే :-

ఈ సర్వే ప్రకారం..ఎన్డీయే కూటమికి 118, వైసీపీకి 39 సీట్లు రావొచ్చని, 18 చోట్ల టఫ్ ఫైట్ ఉండొచ్చని తెలిపింది. బిఫ్రాంక్ పేరిట వైరల్ అవుతున్న మరో సర్వేలో వైసీపీకి 39 సీట్లు వచ్చే అవకాశం ఉందని, ఎన్డీయే కూటమికి 118 సీట్లు వస్తాయని, 18 చోట్ల పోటాపోటీ ఉంటుందని తెలిపింది. మైండ్‌షేర్ యునైటెడ్ సర్వేలో వైసీపీకి 142 సీట్లు, ఎన్డీయే కూటమికి 33 సీట్లు వస్తాయని తెలిపింది. ఇంటిలిజెన్స్ బ్యూరో పేరిట సర్వేలో టీడీపీ 105, వైసీపీ 47, జనసేన 16, బీజేపీ 5, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఓవరాల్ గా మాత్రం మెజార్టీ సర్వేలు కూటమి విజయం సాదించబోతుందని తెలుపడం తో వైసీపీ నేతల్లో , కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. మరి ఈ సర్వేలు ఎంత వరకు నిజం అనేది తెలియాలంటే జూన్ 04 వరకు ఆగాల్సిందే.

Read Also : Boy Kicks Bomb : బాల్ అనుకొని బాంబును తన్నిన బాలుడు.. ఏమైందంటే ?