AP Politricks : `కన్నా` టీడీపీలో చేరిక‌! ఏపీ రాజ‌కీయ `ముఖ‌చిత్రం`కు క్లారిటీ!

తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ చేర‌డం వెనుక పొత్తుల‌ను(AP Politricks) నిర్దేశించే అంశం లేక‌పోలేదు.

  • Written By:
  • Updated On - February 23, 2023 / 03:26 PM IST

తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ చేర‌డం వెనుక పొత్తుల‌ను(AP Politricks) నిర్దేశించే అంశం లేక‌పోలేదు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న‌సేన‌, టీడీపీ పొత్తు మీద ప‌లు ఈక్వేష‌న్లు రావ‌డాన్ని చూశాం. కానీ, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ(Lakshminarayana) టీడీపీలో చేర‌డాన్ని బేస్ చేసుకుని గ‌మ‌నిస్తే , రాబోవు రోజుల్లో టీడీపీ ఒంట‌రిగా ఎన్నిక‌ల్లోకి వెళ్ల‌నుంద‌ని అంచ‌నా వేయ‌డానికి అవ‌కాశం ఉంది. ఎందుకంటే, బీజేపీకి గుడ్ బై చెప్పిన `క‌న్నా` జ‌న‌సేన పార్టీలో చేర‌తార‌ని చాలా మంది భావించారు. ఆ పార్టీ త‌ర‌పున స‌త్తెన‌ప‌ల్లి నుంచి పోటీ చేస్తార‌ని కూడా ఊహించారు. టీడీపీ, జ‌న‌సేన పొత్తు నేప‌థ్యంలో స‌త్తెన‌ప‌ల్లి జ‌న‌సేన‌కు వెళుతుంద‌ని భావించారు. అందుకే, అక్క‌డ టీడీపీ చాలా కాలంగా ఇంచార్జి నియామ‌కం విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించింది.

క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ  టీడీపీలో చేర‌డం వెనుక పొత్తుల‌ను(AP Politricks)

జ‌న‌సేన పార్టీ త‌ర‌పున స‌త్తెన ప‌ల్లి నుంచి పోటీ చేయాల‌ని భావించిన `క‌న్నా` ఇప్పుడు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అంటే, రాబోవు రోజుల్లో టీడీపీ, జ‌న‌సేన పొత్తు ఉండ‌ద‌ని స్ప‌ష్టమ‌వుతోంది. పైగా కాపు సామాజిక‌వ‌ర్గం నుంచి సీనియ‌ర్ లీడ‌ర్ గా కూడా ల‌క్ష్మీనారాయ‌ణ (Lakshminarayana)ఉన్నారు. దీంతో ఆ సామాజివ‌ర్గం ఓట్ల‌ను టీడీపీ కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో గుంటూరు కేంద్రంగా షేర్ చేసుకునే అవ‌కాశం ఉంది. ప్ర‌భుత్వ ఓటు బ్యాంకు చీల‌కుండా చూస్తానంటోన్న ప‌వ‌న్ బీజేపీని వీడి బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితుల్లో(AP Politricks) ఉన్నారు. ఆ పార్టీ టీడీపీతో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డానికి సిద్ధంగా లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో బీజేపీతో క‌లిసి అనివార్యంగా జ‌న‌సేన ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌నుంద‌ని చెప్ప‌డానికి `క‌న్నా` టీడీపీలో చేర‌డాన్ని ఒక ఉదాహ‌ర‌ణ‌గా తీసుకోవ‌చ్చు.

Also Read : Tiruvuru TDP : ఆ నియోజ‌క‌వ‌ర్గంలో మళ్లీ యాక్టీవ్ అవుతున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. టికెట్‌పై ఆశ‌లు..!

ఇటీవ‌ల బీజేపీకి గుడ్ బై చెప్పిన క‌న్నా లక్ష్మీనారాయ‌ణ(Lakshminarayana) టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో గురువారం పసుపు కండువా కప్పుకున్నారు. ముహూర్తాల‌ను విశ్వ‌సించే `క‌న్నా` సరిగ్గా మధ్యాహ్నం 2.48 గంటలకు టీడీపీలో చేరారు. ఆ సంద‌ర్బంగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంత మంది బీజేపీ నేతలు టచ్ లో ఉన్నారని వెల్ల‌డించారు. రాబోవు రోజుల్లో వాళ్లు టీడీపీలో చేరే అవకాశం ఉందనే సంకేతాలు ఇచ్చారు. గుంటూరు లోని తన నివాసం నుంచి కన్నా లక్ష్మీనారాయణ భారీ ర్యాలీతో బయల్దేరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి రావ‌డం ఆయ‌కున్న రాజ‌కీయ బ‌లాన్ని చూపింది. అనంతరం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.

జ‌న‌సేన పార్టీలో చేర‌డానికి సంప్ర‌దింపులు జ‌రిపిన `క‌న్నా` 

గుంటూరు జిల్లా పెద‌కూర‌పాడు నుంచి వ‌రుస‌గా నాలుగు సార్లు గెలుపొందిన క‌న్నా(Lakshminarayana) గుంటూరు వెస్ట్ నుంచి 2009 ఎన్నిక‌ల్లో ఐదోసారి విజ‌యం సాధించారు. స్వ‌ర్గీయ వైఎస్ క్యాబినెట్లో ఆయ‌న మంత్రిగా సుదీర్ఘ‌కాలం ప‌నిచేశారు. 40ఏళ్ల‌కు పైగా రాజ‌కీయ అనుభవం ఉన్న ఆయ‌న తొలి నుంచి చంద్ర‌బాబును వ్య‌తిరేకిస్తూ వ‌చ్చారు. 2014 ఎన్నిక‌ల‌కు ముందుగా వైసీపీలో చేర‌డానికి సిద్ధ‌మై చివ‌రి నిమిష‌నంలో బీజేపీలో చేరారు. ఆ పార్టీ బీజేపీ అధ్య‌క్షునిగా ప‌నిచేసి ప‌లు ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొన్నారు. చంద్ర‌బాబుకు అమ్ముడుపోయాడ‌ని తీవ్ర‌మైన ఆరోప‌ణ‌ల‌ను బీజేపీ లీడ‌ర్ల నుంచి ఎదుర్కొన్నారు. ఆయ‌న స్థానంలో సోము వీర్రాజు బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు అయిన త‌రువాత ఆ పార్టీలో పెద్ద‌గా యాక్టివ్ గా లేరు. జ‌న‌సేన పార్టీలో చేర‌డానికి సంప్ర‌దింపులు జ‌రిపిన `క‌న్నా` టీడీపీలో చేరారు.

Also Read : CBN : గ‌న్న‌వ‌రం ఎపిసోడ్ పై చంద్ర‌బాబు క‌ల‌త‌! రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు బ‌హిరంగ లేఖ‌!!

తెలుగుదేశం పార్టీలో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ(Lakshminarayana) చేర‌డం పొత్తుల‌ను నిర్దేశిస్తోంది. రాబోవు రోజుల్లో టీడీపీ, క‌మ్యూనిస్ట్ లు క‌లిసి పోటీ చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. అలాగే, బీజేపీ-జ‌న‌సేన ఒక కూట‌మిగా ఎన్నిక‌ల‌కు వెళ్ల‌నున్నాయ‌ని అంచ‌నాకు వ‌చ్చే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఇక బీఆర్ఎస్, వైసీపీ లోపాయికారి ఒప్పందంతో ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డానికి అవ‌కాశం ఉంది. మొత్తం మీద క‌న్నా టీడీపీలో చేర‌డం ద్వారా ఏపీ ఎన్నిక‌ల ముఖ‌చిత్రాన్ని(AP Politricks) ఆవిష్క‌రిస్తోంది.

Also Read : CBN : ఇప్పుడు సీఎంగా చంద్ర‌బాబు ఉంటే.!`గ‌న్న‌వ‌రం` ఎపిసోడ్‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌!