AP Political Survey : టీడీపీ – జనసేన – వైసీపీ లను అయోమయానికి గురి చేస్తున్న సర్వే లు

వైసీపీ పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతున్నామని , 175 కు 175 కొట్టబోతున్నామని చెపుతుంటే..ప్రతిపక్షపార్టీలు టీడీపీ - జనసేన మాత్రం రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ కి 15 రావడమే గొప్ప అని

Published By: HashtagU Telugu Desk
Ap Political Survey

Ap Political Survey

ప్రస్తుతం ఏపీ (AP) పైనే యావత్ ప్రజానీకం దృష్టి. రాబోయే ఎన్నికల్లో ఏపీలో ఎవరు అధికారం దక్కించుకుంటారనేదానిపైనే అంత మాట్లాడుకుంటున్నారు. ఓ వైపు వైసీపీ (YCP) పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతున్నామని , 175 కు 175 కొట్టబోతున్నామని చెపుతుంటే..ప్రతిపక్షపార్టీలు టీడీపీ – జనసేన (TDP-Janasena) మాత్రం రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ కి 15 రావడమే గొప్ప అని..రాబోయేది టీడీపీ – జనసేన సంకీర్ణ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సర్వేల (Political Survey) హడావిడి :

ఇదే క్రమంలో రాష్ట్రంలో పలు సర్వే లు నానా హడావిడి చేస్తున్నాయి. ప్రధానంగా ఎన్నికలు రాబోతున్న క్రమంలో పలు సంస్థలు ప్రజల వద్దకు వెళ్లి ఏ ప్రభుత్వం రావాలి..?ఎవర్ని సీఎం గా కోరుకుంటున్నారు..? ఏ ప్రభుత్వమైతే బాగుంటుందని అనుకుంటున్నారు..? ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుందని భావిస్తున్నారు..? అంటూ పలు ప్రశ్నలు అడిగి వారి నుండి సమాదానాలు రాబడుతుంటారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి మొదలుకావడం తో పలు సంస్థలు సర్వేలు చేయడం మొదలుపెట్టాయి. ముఖ్యంగా ఏపీలో పలు సంస్థల సర్వేలు పార్టీలను అయోమయానికి గురి చేస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

టౌమ్స్ నౌ సర్వే (Times Now Survey) :

తాజాగా జాతీయ ప్రముఖ వార్త సంస్థ టౌమ్స్ నౌ ఏపీ లో మరోసారి వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి రాబోతుందని, దాదాపుగా ఎంపీ స్థానాల్లో వైసీపీదే హవా అని చెప్పుకొచ్చింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అరెస్టు అయి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రజలు సానుభూతి చూపించారు. కానీ అది ఓట్ల విషయానికి వస్తే మాత్రం జగన్ జై కోట్టారని తన సర్వేలో వెల్లడించింది.

ఆత్మసాక్షి (Atmasakshi Survey) సర్వే :

ఇక టౌమ్స్ నౌ సర్వే ఇలా ఉంటె.. ఆత్మసాక్షి అనే సర్వే మాత్రం ఈసారి ఏపీలో టీడీపీ ఘనవిజయం సాదించబోతుందని తెలిపింది. రాబోయే ఎన్నికల్లో 54శాతం ఓట్లతో టీడీపీ – జనసేన పార్టీలు అధికారం చేపట్టడం ఖాయమని తేల్చి చెప్పింది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో టీడీపీదే పైచేయి అని సర్వేలో తేలింది. ప్రస్తుతం వైసీపీ కంటే టీడీపీకి 3శాతం ఓట్లు ఎక్కువగా వచ్చాయని సర్వేలో వెల్లడించింది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరుగుతుందని అంచనా వేసింది. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ఎవరూ అపలేరని సర్వే తేల్చి చెబుతోంది. మరి నిజంగా ఎవరి సర్వే నిజం..? అనేది వారికీ తెలియాలి.

మాములుగా చాలావరకు పార్టీలు తమకు అనుకూలంగా సర్వేలు చేయించుకుంటాయి. ప్రజలు చెప్పేది ఒకటైతే..చూపించేది మరోటి. మరి ఈ రెండు సర్వేలలో నిజం ఎంత అనేది ఎన్నికల సమయం నాటికీ తేలిపోతుంది.

Read Also : Chandrababu : కాసేపట్లో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ

  Last Updated: 03 Oct 2023, 11:39 AM IST