ఏపీలో ఎన్నికల (AP Elections) నోటిఫికేషన్ ఇంకా రానేలేదు..అప్పుడే అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీల నేతల ప్రచారం (Campaign ) జోరు అందుకుంది. నువ్వా..నేనా అనే రేంజ్ లో మాటల యుద్ధం నడుస్తుంది. అధికార పార్టీ వైసీపీ (YCP) సిద్ధం అంటుంటే..టిడిపి (TDP) రా..కదలిరా అంటుంది. ఇక మధ్య కాంగ్రెస్ (Congress) సైతం యాత్ర కు మీము సిద్ధం అంటుంది. ఇలా ఈ మూడు పార్టీలు ప్రచారం మొదలుపెట్టగా..ఇక త్వరలో బిజెపి (BJP) సైతం మీము రెడీ అంటున్నారు. గల్లీ నేతల్ని కాదు ఢిల్లీ నేతల్ని రంగంలోకి దింపుబోతున్నారు. ప్రధాని మోడీ తో పాటు అమిత్ షా..యూపీ సీఎం యోగి తదితరులను ప్రచారంలోకి దింపబోతుంది. ఇప్పటి వరకు మీరు టీజర్ మాత్రమే చూసారని రాబోయే రోజుల్లో అసలు సినిమా చూడబోతారని అంటున్నారు.
శనివారం ఏపీలో వరుస నేతల ప్రచారం తో హోరెత్తిపోయిది. వైసీపీ అధినేత జగన్ భీమిలి లో ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ సందర్భాంగా టిడిపి , జనసేన , కాంగ్రెస్ పార్టీల ఫై విరుచుకపడ్డారు. ప్రతిపక్షాల పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి తాను అభిమన్యుడిని కాదని అర్జునుడిని .. ‘కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం భీమిలిలో కనిపిస్తోంది. కృష్ణుడిలా నాకు కార్యకర్తలు, ప్రజలు అండగా ఉన్నారు. చంద్రబాబుతో సహా కౌరవ సైన్యం అంతా ఓడిపోతుంది. పథకాలు, అభివృద్ధే మన అస్త్రాలు. ఈ యుద్ధంలో 175కి 175 సీట్లు కొట్టడమే మన టార్గెట్’ అని జగన్ చెప్పుకోచ్చారు. దుష్టచతుష్టయాన్ని.. గజదొంగల ముఠాని ఓడించడానికి మీరు సిద్ధమా?. వచ్చే రెండు నెలలు మనకు యుద్ధమే. ఈ రెండు నెలలు మీరు సైన్యంగా పని చేయాలి. దుష్టచతుష్టయం సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి. మన టార్గెట్ 175 కు 175 అసెంబ్లీ, 25 కు 25 ఎంపీ స్థానాలు గెలవడమే అని సీఎం పేర్కొన్నారు. ఈ యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందే అని అన్నారు.
మరోపక్క చంద్రబాబు సైతం రా..కదలిరా సభల్లో జగన్ ఫై విరుచుకపడుతున్నారు. గత కొద్దీ రోజులుగా వరుసగా నియోజకవర్గాల్లో భారీ సభలు నిర్వహిస్తూ ప్రజలకు ఆకట్టుకుంటున్నారు బాబు. సీఎం జగన్ రాజకీయ వ్యాపారి గా మారిపోయారని , మద్యంపై ఆదాయాన్ని తాడేపల్లి ప్యాలెస్లో లెక్కేసుకోవడమే ఆయన పని గా పెట్టుకున్నారని బాబు అన్నారు.’నాణ్యత లేని మద్యం వల్ల రాష్ట్రంలో 35 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు. మద్యం విక్రయాలపై డిజిటల్ చెల్లింపులు ఎందుకు లేవో జగన్ చెప్పాలి. మద్య నిషేధం అని చెప్పి మాట తప్పిన వ్యక్తికి ఓటు అడిగే హక్కు లేదు’ అని దుయ్యబట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
అబద్ధాల్లో సీఎం జగన్ పీహెచ్డీ చేశారని, రూ.10 ఇచ్చి రూ.100 దోచుకోవడమే ఆయన పాలసీ అని మండిపడ్డారు. ‘నా పాలనలో అప్పుల మోత, పన్నుల వాత లేదు. ప్రస్తుతం పేదవాడి బతుకు చితికిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. బటన్ నొక్కుడులో ఎంత దోచుకున్నారో జగన్ చెప్పాలి. నాడు లేని అప్పులు ఇప్పుడు ఎందుకొచ్చాయో సమాధానం ఇవ్వాలి’ అని ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ అధికార అహంకారాన్ని దించేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు. నేను కూడా రాయలసీమ బిడ్డనే. నాలో ఉండేది సీమ రక్తమే. అందుకే ఈ ప్రాంతాన్ని రతనాల సీమ చేయడానికి సాగు నీటి కోసం రూ.12,500 కోట్లు ఖర్చు చేశా. జగన్ సీమ కోసం ఏం చేశారో చెప్పాలి. వచ్చే కురుక్షేత్ర యుద్ధానికి మేం సిద్ధం. గెలుపు TDP-JSPదే’ అని పేర్కొన్నారు.
ఇక ఏపీసీసీ బాధ్యత చేపట్టిన షర్మిల..పదవి చేపట్టడమే ఆలస్యం వైసీపీ , టిడిపి , జనసేన , బిజెపి లపై విరుచుకుపడుతూ వస్తుంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర లో పర్యటిస్తున్న ఆమె..ఫిబ్రవరి లో బస్సు యాత్ర చేప్పట్టబోతోంది. ఈ క్రమంలోనే వరుసగా జిల్లాలో పర్యటిస్తూ కాంగ్రెస్ నేతలతో సమావేశం అవుతూ..వైసీపీ ఫై విమర్శలు చేస్తూ..ప్రజలను ఆకట్టుకుంటుంది.
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం వచ్చే నెల నుండి తన ప్రచారాన్ని మొదలుపెట్టబోతున్నారు. జనసేన అధినేత ప్రజల్లోకి వస్తే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. మిగతా నేతలంతా డబ్బులు పెట్టి ప్రజలను రప్పిస్తే..పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం సొంత డబ్బులు పెట్టి అయన సభలకు వస్తారు. ఇక మొత్తం మీద రాబోయే రోజుల్లో ఏపీలో నేతల ప్రచారం అంతకు మించి అనేలా ఉండబోతుందని తెలుస్తుంది. మరి ప్రజలు ఎవరికీ పట్టం కడతారో చూడాలి.
Read Also : Govt Plots Registration : 30 లక్షల మందికి గుడ్ న్యూస్.. ఆ స్థలాలపై పేదలకు ఆస్తిహక్కు