ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి ఏపీ ప్రభుత్వం(AP Government) సడెన్ గా ఏదో ఒక నిర్ణయాలను తీసుకుంటూనే ఉంటుంది. తాజాగా జనసేన(Janasena)కు ఝలక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. జనసేనాని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నిర్వహిస్తా అన్న వారాహి యాత్ర(Varahi Yatra) ఇప్పటికే పలు సార్లు వాయిదా పడింది. ఈ సారి ఎట్టి పరిస్థితిలోను వాయిదా పడదని జూన్ 14 నుంచి అన్నవరంలో సత్యనారాయణ స్వామికి పూజలు చేసి యాత్రను మొదలుపెట్టి భీమవరం వరకు చేస్తామని ప్రకటించారు.
పార్టీ నాయకులు, జనసైనికులు ఈ యాత్ర కోసం ఇప్పటికే చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో, కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లాల్లో సెక్షన్ 30 యాక్ట్ అమలు ఉందని పోలీసులు తాజాగా ప్రకటించారు. నేడు జూన్ 11 నుంచి నెలాఖరు జూన్ 30 వరకు కాకినాడ నగరం, కాకినాడ రూరల్, పిఠాపురం, అమలాపురం, కొత్తపేట రామచంద్రపురం డివిజన్లో సెక్షన్ 30 అమలుచేశారు పోలీసులు. ముందస్తు అనుమతులు లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు చేయకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు.
అయితే దీనిపై జనసైనికులు, పార్టీ నాయకులు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను అడ్డుకోవడం కోసమే కేవలం యాత్ర జరిగే ప్రదేశాల్లోనే ఈ నిబంధనలు అమలు చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు జనసేన నేతలు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వారాహి యాత్ర నిర్వహిస్తాము అని అంటున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ స్పందించలేదు. మరి ఈ చర్య ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో, వారాహి యాత్ర జరుగుతుందో లేదో చూడాలి.
Also Read : AP Kapu Politics; పవన్ దూకుడుకు జగన్ కళ్లెం!వైసీపీలో కి ముద్రగడ?