Site icon HashtagU Telugu

CM Chandrababu : దేశంలోనే ఏపీ పోలీస్‌లకు ప్రత్యేక బ్రాండ్ ఉంది: సీఎం చంద్రబాబు

AP Police has a unique brand in the country: CM Chandrababu

AP Police has a unique brand in the country: CM Chandrababu

Police Memorial Day : ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అన్ని శాఖల కంటే పోలీసు శాఖ అత్యంత కీలకమని అన్నారు. దేశంలోనే ఏపీ పోలీస్‌లకు ప్రత్యేక బ్రాండ్ ఉందన్న చంద్రబాబు.. తాను సీఎంగా ఉన్న ప్రతిసారీ పోలీసు వ్యవస్థను పటిష్ఠపరిచే అనేక చర్యలు చేపట్టానని తెలిపారు. ఏ ప్రగతికైనా పోలీసులే కీలకమని చెప్పారు. ప్రజల ఆస్తులు, ప్రాణాలు కాపాడేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని అన్నారు. ఇలా ప్రజాసేవ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు. పోలీసుల సంక్షేమం కూటమి ప్రభుత్వం బాధ్యత అని ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు తెలిపారు.

విధి నిర్వహణలో చాలా మంది పోలీసులు అమరులయ్యారని, వారందరూ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా ఉండిపోతారని తెలిపారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల కాపేందుకు ప్రాణాలను సైతం లెక్క చేయారని పోలీసులను ప్రశంసించారు. ఎప్పుడూ అహర్నిశలు శ్రమిస్తుంటారని తెలిపారు. ఉమ్మడి ఏపీలో నక్సలిజంపై ఉక్కుపాదం మోపారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఫ్యాక్షనిజం, రౌడీల ఆట కట్టించారని గుర్తుచేశారు. శాంతి భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉందన్నారు. పోలీసుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్ర విభజనతో పోలీస్ వ్యవస్థలో మార్పులు తెచ్చామన్నారు, వాహనాలు, అధునాతన పరికరాలు, సాంకేతిక సౌకర్యం కల్పించామని తెలిపారు. పోలీసుల సంక్షేమం కోసం 20214-19 మధ్య కాలంలో రూ. 600 కోట్లు ఖర్చ చేశామని తెలిపారు. కొత్త వాహనాలకోసం రూ. 150 కోట్లు, పోలీస్ క్వార్టర్ల మర్మతులు, నిర్మాణాలకు రూ. 60 కోట్లు మంజూరు చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. ఏపీఎఫ్ఎస్ఎల్ ఎక్విప్‌మెంట్ కొనుగోలుకు రూ. 27 వేలు ఇచ్చినట్లు తెలిపారు. పోలీస్ సంక్షేమానికి రూ. 55 కోట్లు కేటాయించామని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ శాఖలో పెండింగ్‌లో బిల్లలన్నీ క్లియర్ చేశామని చెప్పారు. ‘దిశ’ వాహనాలకు 16 కోట్లు, కమ్యూనికేషన్ ఎక్విప్ మెంట్ కు రూ. 20 కోట్ల పెండింగ్ పెడితే వాటినీ చెల్లించామని సీఎం చంద్రబాబు తెలిపారు.

ఈ సందర్భంగా రౌడీలకు, సైకోలకు చంద్రబాబు సవాల్ విసిరారు. నేరాలు చేస్తే వదిలేది లేదన్నారు. నేరాలు చేస్తే రౌడీలకు అదే చివరి రోజు అవుతుందని వార్నింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వ వారసత్వంగా గంజాయి వచ్చాయని, డ్రగ్స్ పెద్ద సవాలుగా మారిందని తెలిపారు. విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారని, చిన్న పిల్లలని కూడా వదిలిపెట్టటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కేసును ఒక సవాలుగా తీసుకుని, వారికి కఠిన శిక్ష పడేలా చేస్తామని హెచ్చరించారు. చట్ట ప్రకారమే శాశ్వత పరిష్కారం చూపిస్తామని, ప్రత్యేక కోర్టులు పెట్టి, వెంటనే శిక్షలు పడేలా చేస్తామని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.

Read Also: NTR Devara : ఎన్టీఆర్ దేవర ఓటీటీ రిలీజ్ డేట్ లాక్..?