Site icon HashtagU Telugu

Chandrababu : చంద్రబాబు పోలీసులకు క్షమాపణలు చెప్పాలి.. పుంగ‌నూరు ఘ‌ట‌న‌పై పోలీసు సంఘం అధికారులు ఫైర్..

AP Police Association fires on Chandrababu Naidu regarding Punganur Issue

AP Police Association fires on Chandrababu Naidu regarding Punganur Issue

టీడీపీ(TDP) క్యాడ‌ర్ ను అణ‌చివేయ‌డానికి వైసీపీ ఎప్పట్నుంచో పోలీసుల‌ను వాడుకుంటోంది అని విమర్శలు వస్తున్నాయి. తాజాగా చిత్తూరు(Chittoor) జిల్లా పుంగ‌నూరు(Punganur) ఘ‌ట‌న‌లోనూ అదే జ‌రిగింది. ప‌ర‌స్ప‌రం టీడీపీ, వైసీపీ(YCP) శ్రేణుల మ‌ధ్య రాళ్ల దాడి జ‌రిగింది. కానీ ఈ రాళ్ళ దాడిలో కేవలం టీడీపీకి చెందిన 50 మందిని అరెస్ట్ చేసిన‌ట్టు పోలీసులు ప్ర‌క‌టించారు. దీంతో పోలీసులపై టీడీపీ నేతల నుంచి విమర్శలు ఎక్కువయ్యాయి.

తాజాగా పోలీసులు(Police) మీడియాతో మాట్లాడిన వ్యాఖ్యలు వైసీపీ నాయకులే మాట్లాడించినట్టు ఉంది. పుంగనూరు ఘటనను పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. చంద్రబాబుపై ఏపీ పోలీసు అధికారుల సంఘం ఫైర్ అయింది. పుంగనూరు ఘటనపై పోలీసు అధికారుల సంఘం తాజగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పోలీసులను హత్య చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నారు. ఈ ఘటనతో ఒక పథకం ప్రకారమే పోలీసులను హతమార్చే భారీ కుట్ర జరుగుతున్నట్లు అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనిమీద ఎంక్వైరీ జరిపించాలి. పోలీసులపై దాడి జరుగినా ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, ప్రజలు ఎవ్వరూ సానుభూతి చూపలేదు. పుంగనూరులో పోలీసులపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డీజీపీ, ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పోలీసులపై కొంతమంది ఉద్ధేశపూర్వకంగానే దాడి చేశారు. 50 మంది పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. 13 మంది ఆసుపత్రిలో ఉన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు చాలా దారుణంగా మాట్లాడారు. పోలీసులను అసభ్య పదజాలంతో దూషించారు. మీ ప్రభుత్వంలో కూడా పోలీసు వ్యవస్థలో మేం పనిచేశాం. మేం ఏ పార్టీకి అనుకూలంగా ఎన్నడూ పనిచేయలేదు. కార్యకర్తలను రెచ్చగొట్టేలా చంద్రబాబు వ్యవహరించిన తీరు సరికాదు. చంద్రబాబును తక్షణమే అరెస్ట్ చేయాలి అంటూ వ్యాఖ్యానించారు.

ఏపీ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర కోశాధికారి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. పుంగనూరు ఘటన దురదృష్టకరం. పోలీసు వాహనాలకు నిప్పు పెట్టి విధ్వంసం సృష్టించాలని చూశారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు.

పోలీసు అధికారుల సంఘం ఉపాధ్యక్షురాలు నాగిని మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వం ఉన్నా మా డ్యూటీ మేము చేస్తున్నాం. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు ఇలా మాట్లాడితే ప్రజలు ఎలా మాట్లాడతారు. నిన్న జరిగిన ఘటనతో మా కుటుంబాల్లో భయం పట్టుకొంది. డీజీపీ గారికి మా అసోసియేషన్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఉద్యోగాలు చేయాలంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి కోరుతున్నాం. ప్రభుత్వంతో మాకు సంబంధం లేదు. మేము డ్యూటీ మాత్రమే చేస్తున్నాం. చంద్రబాబు నాయుడికి చేతులెత్తి మొక్కుతున్నాం. మీ రాజకీయాల్లోకి మమ్మల్ని లాగొద్దు అని అన్నారు.

ఇక పోలీసు సంఘం జాయింట్ సెక్రటరీ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. మేం ప్రభుత్వ ఉద్యోగులం. రాజకీయ పార్టీలతో మాకు సంబంధం లేదు. రాళ్లు వేయడం, విధ్వంసానికి పాల్పడటం సంఘవిద్రోహ శక్తుల లక్షణాలు. పోలీసులపై దాడులు చేసి ఏం చేయాలని చూస్తున్నారు. ఎటువంటి మెసేజ్ సమాజానికి ఇవ్వాలని చూస్తున్నారు. తక్షణమే చంద్రబాబు పోలీసులకు క్షమాపణ చెప్పాలి అంటూ వ్యాఖ్యానించారు.

అయితే పుంగనూరు ఘటనపై పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తీరు వైసీపీ నాయకులూ మాట్లాడినట్టే ఉందని, ప్రభుత్వం పోలీసులతో అలా మాట్లాడించిందని, వైసీపీ వాళ్ళు కూడా దాయాది చేసినా క్కర్ని కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేదని, వాళ్ళ గురించి మాత్రం మాట్లాడలేదని విమర్శలు చేస్తున్నారు. ఈ ప్రెస్ మీట్ తో పోలీసులపై ప్రజల్లో కూడా విమర్శలు వస్తున్నాయి.

 

Also Read : Chandrababu: సీమ సాగునీటి ప్రాజెక్టులపై CBN ప్రజెంటేషన్