గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బొండా ఉమలపై మాచర్లలో జరిగిన దాడి కేసులో ప్రధాన నిందితుడు తురకా కిశోర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తురకా కిశోర్ (AP Police Arrests Turaka Kishore ), వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అత్యంత అనుచరుడిగా పేరొందాడు. గతంలో వైసీపీ ప్రభుత్వం అండతో అనేక దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ నేతలపై దాడి కేసులో నిందితుడిగా కిశోర్ పేరుకు రావడం చర్చనీయాంశమైంది. వైసీపీ ప్రభుత్వ అండ చూసుకొని ఎన్నో దౌర్జన్యాలకు ఇతడు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో ఎక్కడ అరెస్టు చేస్తారో అని భయపడి గత కొద్దీ రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లాడు. అయితే ఇటీవల పల్నాడు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, హైదరాబాదులో అతడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన కిశోర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉండగా, ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో కిశోర్‌ను అరెస్ట్ చేసినప్పటికీ, ఒక్కరోజులో స్టేషన్ బెయిల్ పొందడం అప్పట్లోనే వివాదస్పదమైంది. కిశోర్ అరెస్టుతో టీడీపీ నేతలు తమ పక్షాన న్యాయం జరుగుతుందన్న ఆశ వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి సంబంధించి అన్ని వివరాలు బయటపెట్టి, అతడి అక్రమాలకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇక కిశోర్ అరెస్టుతో వైసీపీ శ్రేణులు సైలెంట్ గా ఉండగా, రాజకీయ వర్గాల్లో ఈ పరిణామం చర్చనీయాంశమైంది.
Read Also : Ayyappa Society : అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆదేశాలు