Site icon HashtagU Telugu

AP People : పవన్ కళ్యాణ్ ఫై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారా..?

I am in PM Modi's heart: Pawan Kalyan

I am in PM Modi's heart: Pawan Kalyan

ఏపీ ప్రజలు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై ఆగ్రహంగా ఉన్నారా..? అంటే అవుననే చెప్పాలి. దీనికి కారణంగా కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి కూడా అత్యాచారాలు , ఆడపిల్లల కిడ్నాప్ లు , హత్యలు, దాడులు ఇలా అనేకమైనవి జరుగుతూనే ఉన్నాయి. గడిచిన ఐదేళ్లలో కూడా ఇలాంటివి జరిగాయి. దీనికి కారణం జగన్ పాలన వైఫల్యం..మంత్రుల అసమర్థత, పోలీసులు నిఘా వైఫల్యం అంటూ అప్పటి ప్రతిపక్ష పార్టీలు టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీలు ఆరోపించాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆడపిల్లల కిడ్నాప్లు , అత్యాచారాల ఫై పదే పదే జగన్ సర్కార్ ఫై విమర్శలు చేస్తూ వచ్చారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఇవన్నీ జరగకుండా చేస్తామని తెలుపుతూ వచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి ఈరోజు ప్రజలు కూటమి సర్కార్ ను అధికారంలోకి తీసుకొచ్చారు. అయినప్పటికీ రాష్ట్రంలో దాడులు , అత్యాచారాలు , ఆడపిల్లల కిడ్నాప్ లు ఆగడం లేదు. ప్రతి రోజు ఎక్కడో చోట ఇలాంటివి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. నిన్నటికి నిన్న నడిరోడ్డు ఫై ఓ వ్యక్తిని అతిదారుణంగా అందరు చూస్తుండగా కత్తితో నరికి నరికి చంపాడు. ఇంత జరుగుతున్న చుట్టూ పదుల సంఖ్యలో జనాలు ఉన్నారు కానీ ఒక్కరు కూడా ఆపేందుకు ట్రై చేయలేదు. ఇదో వినోదం చూస్తున్నట్లు చూస్తున్నారు తప్ప ఏ ఒక్కరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.

అంతేనా..గత పది రోజులుగా రాష్ట్రంలో వరుసగా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఐదు నెలల పసికందును కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు. ఇలా ఇన్ని జరుగుతున్న పోలీసులు మాత్రం అరికట్టడం లేదు. నింధితులను పట్టుకున్నామని చెపుతున్నారు తప్ప..కఠినశిక్ష విధించి ఇంకోసారి ఇలాంటి పనిచేయాలంటే భయపడే విధంగా చేయడం లేదు. దీంతో కామాంధులు , రౌడీ మూకలు రెచ్చిపోతున్నారు. చట్టం ఏమిచేస్తుంది లే అనే ధీమా తో వారి దాడులు అలాగే కొనసాగిస్తున్నారు.

అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా..? ఇంతజరుగుతున్న పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు..? కూటమి సర్కార్ కూడా జగన్ సర్కార్ మాదిరిగానేనా..? ఇదేనా ప్రజలు కోరుకున్న మార్పు..? ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి కంట్రోల్ చేస్తాడా..? లేక అలాగే మౌనంగా ఉంటాడా..? అని అంత ప్రశ్నిస్తున్నారు.

Read Also : supreme court : సుప్రీంకోర్టు జడ్జీలుగా కోటీశ్వరసింగ్, మహదేవన్ల ప్రమాణ స్వీకారం