Chiranjeevi Re Enrty : చిరు మెగా పొలిటికల్ రీ ఎంట్రీ! AP PCC చీఫ్ ప్రకటన, కాంగ్రెస్ జోష్

ఏపీ రాజకీయాల్లో మళ్ళీ చిరంజీవి (Chiranjeevi) కలకలం బయలుదేరింది.

  • Written By:
  • Publish Date - January 22, 2023 / 09:00 AM IST

ఏపీ రాజకీయాల్లో మళ్ళీ చిరంజీవి (Chiranjeevi) కలకలం బయలుదేరింది. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటానికి వస్తారని ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్ర రాజు (Gidugu Rudra Raju) ప్రకటించారు. ఇటీవల రాహుల్ కు ఆ మేరకు చిరంజీవి లెటర్ రాసారని గిడుగు ఏపీ రాజకీయాలపై పిడుగు వేశారు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి (Congress Party) చిరంజీవి రాజీనామా చేయలేదు. సభ్యత్వం కూడా ఉంది.

దీంతో గిడుగు చేసిన ప్రకటన చర్చనీయాంశం అయింది.మెగాస్టార్‌ చిరంజీవి మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా? మళ్ళీ గ్రౌండ్‌ జీరో నుంచి జర్నీ మొదలుపెడతారా? అంటూ ఏపీ పాలిటిక్స్‌లో కొత్త చర్చ మొదలైంది. సొంత పార్టీని మడతబెట్టి కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాజ్యసభ మెంబర్‌గా కొత్త టర్న్‌ తీసుకున్న చిరంజీవి, ఇక పాలిటిక్స్‌కి గుడ్‌బై చెప్పినట్లేనని అందరూ ఫిక్సయ్యారు. ఆమధ్య చిరంజీవి పార్టీ మారబోతున్నారన్న వార్తలు కూడా వినిపించాయి. వీటన్నిటికీ చెక్‌ చెబుతూ పీసీసీలో క్రియాశీలకంగా మారబోతున్నట్లు సంకేతాలిచ్చారు చిరంజీవి.

సొంత జిల్లా పశ్చిమగోదావరి(West Godavari) నుంచి పీసీసీ సభ్యుడిగా చిరంజీవి ఎంపికయినట్లు పార్టీ వర్గాలు ఖరారు చేశాయి. జిల్లాలో మొత్తం 17 మంది సభ్యులను నియమిస్తే అందులో చిరంజీవి ఒకరు. ముందుగా కొవ్వూరు బ్లాక్‌ 1 నుంచి పిసిసి సభ్యురాలిగా కాంగ్రెస్‌ పార్టీ మహిళా నేత అమరజహా  (AmaraJaha)పేరు ఖరారైంది. కానీ, చిరంజీవి కోరిక మేరకు ఆమె తప్పుకోవడంతో ఈ మెగా ఎంపిక ఫైనల్‌ అయింది. తన రాజకీయ భవిష్యత్తుపై మీడియాలో వస్తున్న రకరకాల ఊహాగానాలకు ఈ విధంగా తెర దించాలని చిరంజీవి ప్లాన్‌ చేశారన్నది తాజా ఊసు. మరోవైపు తన 151వ సినిమా షూటింగ్‌ లో బిజీగా వున్న చిరంజీవి ఆ తర్వాత మరికొన్ని సినిమాలకు కూడా సంతకాలు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి చిరంజీవి ఎలా పనిచేస్తారన్న సందేహాలు ఇంకోవైపు, ఈనెల 10న విజయవాడలో జరిగే పీసీసీ సర్వ సభ్య సమావేశంలో పాల్గొనడం ద్వారా చిరంజీవి మరింత సమాచారం ఇవ్వచ్చు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లోకి తాను వెళ్ల‌బోన‌ని మెగా స్టార్ చిరంజీవి కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు ఇటీవల స్ప‌ష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న‌పై వ‌స్తున్న ఊహాగానాల‌కు ఈ ప్ర‌క‌ట‌న‌తో తెర‌ప‌డిన‌ట్టేన‌ని అనుకున్నారు. జ‌న‌సేన అధ్య‌క్షుడిగా చిరంజీవి త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీలో కొన‌సాగుతుండ‌టం, అధికార పార్టీపై ఎప్ప‌టిక‌ప్పుడు విమ‌ర్శ‌లు చేస్తుండ‌టం, ఆయ‌న‌పై అధికార పార్టీ నేత‌లు కూడా విరుచుకుప‌డుతుండ‌టం కూడా తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చిరంజీవి ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌లు కూడా చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. త‌న త‌మ్ముడు సీఎం అయితే చూడాల‌ని త‌న‌కు ఉండ‌దా అంటూ ఆయ‌న వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. ఈ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో చిరంజీవి త‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఎన్నిక‌ల నాటికి స‌పోర్టుగా నిలుస్తాడ‌ని అంద‌రూ భావించారు.

2024 ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో చిరంజీవి సోద‌రులు ప‌వ‌న్ క‌ల్యాణ్‌, నాగ‌బాబు (Pawan Kalyan and Nagababu ) ఏపీలో ఇప్ప‌టికే పొలిటిక‌ల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసిన విష‌యం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ (Telugudesam Party) తో జ‌న‌సేన (janasena) పొత్తు పెట్టుకుంటున్న నేప‌థ్యంలో చిరంజీవి ఆశీస్సులు ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఉంటాయా అనే ప్ర‌శ్న‌లు వ‌చ్చాయి. గ‌తంలో ప్ర‌జారాజ్యం పార్టీతో రాజ‌కీయ నాయ‌కుడిగా యాక్టివ్‌గా వ్య‌వ‌హ‌రించిన చిరంజీవి, ఆ త‌ర్వాత పూర్తిగా సినిమాలకే త‌న స‌మ‌యం కేటాయిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఇటీవ‌ల ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న మ‌ళ్లీ ఏపీ రాజ‌కీయాల్లో యాక్టివ్ అవుతారా అనే సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలోనే చిరంజీవి తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ ఓ విస్ప‌ష్ట ప్ర‌క‌ట‌న చేశారు.

ఏపీ రాజ‌కీయాల‌కు సంబంధించి ఎలాంటి సంబంధం లేద‌ని వారం క్రితం తేల్చి చెప్పారు. త‌న‌కు ఓటు హ‌క్కు కూడా హైద‌రాబాద్‌లోనే ఉంద‌ని, పొరుగు రాష్ట్రాల్లో రాజ‌కీయాల‌కు సంబంధించి త‌న‌కు ఎలాంటి ఆస‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు. పొరుగు రాష్ట్రాల్లో ఏం జ‌రుగుతుంద‌నే విష‌య‌మై తాను క‌నీసం ప‌త్రిక‌లు కూడా చూడ‌టం లేద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. త‌న సోద‌రుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీ రాజ‌కీయాల్లో ఉన్నందు వ‌ల్ల త‌న‌కు రాజ‌కీయాలు అంట‌గ‌ట్ట‌డం స‌రికాద‌ని కూడా ఆయ‌న స్ప‌ష్టం చేశారు.మెగా బ్ర‌ద‌ర్స్ ముగ్గురికీ రాజ‌కీయ భ‌విష్య‌త్తు లేదంటూ ఏపీ మంత్రి రోజా ఇటీవ‌ల విమ‌ర్శించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రోజా వ్యాఖ్య‌ల‌పైనా చిరంజీవి స్పందిస్తూ ఆమె ఆ వ్యాఖ్య‌లు ఏ కార‌ణంతో చేశార‌నే విష‌యం ఆమెనే అడ‌గాల‌ని చెప్పారు. రోజాతో తాను క‌లిసి న‌టించాన‌ని, ఆమెతో త‌మ‌కు ఎలాంటి మ‌న‌స్ప‌ర్థ‌లూ లేవ‌ని ఈ సంద‌ర్భంగా చిరంజీవి స్ప‌ష్టం చేశారు. మంత్రి అయ్యాక రోజా త‌మ ఇంటికి కూడా వ‌చ్చార‌ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. ఇవన్నీ నడుస్తున్న క్రమంలో ఏపీ పీసీసీ చీఫ్ తాజాగా చేసిన ప్రకటన చిరంజీవి రీ ఎంట్రీని కాంగ్రెస్ ఖరారు చేస్తుంది.