Site icon HashtagU Telugu

AP New Ration Cards : రేపటి నుంచే ఏపీలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు

Ap New Ration Cards Issued

Ap New Ration Cards Issued

ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ (TDP Govt)..ఎన్నికల హామీలను ఒక్కోటిగా నెరవేరుస్తూ ప్రజల నమ్మకాన్ని నిలుపుకుంటూ వస్తుంది. ఇప్పటికే పలు హామీలను నెరవేర్చగా..ఇప్పుడు మరో కీలక హామీని నెరవేర్చేందుకు సిద్ధమైంది. తాము అధికారంలోకి వస్తే అర్హులైన పేదలకు రేషన్ కార్డులు (AP New Ration Cards) మంజూరు చేస్తామని కూటమి సర్కార్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. దీన్ని నెరవేర్చేందుకు కసరత్తులు ప్రారంభించింది.

ఈ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకుని కార్డులు రాని వారికి కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారితో పాటు కొత్త దరఖాస్తుదారులకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏపీలో కొత్త రేషన్ కార్డులు పింఛన్లకు రేపటి(డిసెంబర్ 2) నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. సంక్రాంతి కానుకగా అర్హులుగా జనవరిలో కొత్త కార్డులు మంజూరు చేస్తారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లు కార్డులు అందించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ నిర్ధిష్టమైన అర్హతలు కలిగిన లబ్ధిదారులను గుర్తించి, వారికి ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా ఉంచుకుని చేపడుతోంది.

దరఖాస్తు ప్రక్రియ:

కొత్త రేషన్ కార్డులు మరియు పింఛన్ల కోసం దరఖాస్తులు గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా స్వీకరించబడతాయి. ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు:

రేషన్ కార్డుల కోసం, ఆదాయ పరిమితి, కుటుంబం సభ్యుల వివరాలు వంటి అంశాలు ముఖ్యంగా పరిశీలిస్తారు. పింఛన్ల కోసం వయసు, అంగవైకల్యం, నిరుపేద పరిస్థితి వంటి అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యాక, కొన్ని రోజుల్లో లబ్ధిదారులను పరిశీలించి అనుమతిస్తారు. ఎంపిక పూర్తయిన తర్వాత, లబ్ధిదారులకు సమాచారం అందజేయబడుతుంది.

ఎలా దరఖాస్తు చేయాలి:

సచివాలయానికి వెళ్లి సంబంధిత ఫారాలు తీసుకోవాలి.
అవసరమైన వివరాలు మరియు ధృవపత్రాలు సమర్పించాలి.

ఉదాహరణకు:

ఆదాయ ధృవపత్రం
ఆధార్ కార్డు
నివాస ధృవపత్రం
కుటుంబ సభ్యుల వివరాలు.

Read Also : AEE Nikesh : తెలంగాణ ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ కుమార్‌కు 14 రోజుల రిమాండ్