AP DGP: ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు

ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి అధికారం చేపట్టింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పలు కీలక శాఖలలో ప్రక్షాళన మొదలు పెట్టారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు.

AP DGP: ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి అధికారం చేపట్టింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పలు కీలక శాఖలలో ప్రక్షాళన మొదలు పెట్టారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

తిరుమలరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. 1989 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన తిరుమలరావు సీనియార్టీ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కీలక పదవి కట్టబెట్టింది. కాగా ఈ రోజే ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రిగా అనిత వంగలపూడి బాధ్యతలు స్వీకరించారు . తన కుమార్తె రష్మితతో కలిసి వంగలపూడి అవసరమైన పత్రాలపై సంతకాలు చేసి బాధ్యతలు స్వీకరించే ముందు ప్రత్యేక పూజలు చేశారు.

Also Read: AP News: చంద్రబాబు రాకతో జోరందుకున్నరియల్ ఎస్టేట్