Site icon HashtagU Telugu

AP Elections 2024 : ఇప్పటి వరకు ఏపీలో కూటమి ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య ఎంతంటే..!!

Suparipalanalo Toliadgugu

Suparipalanalo Toliadgugu

ఏపీ(AP)లో ఎన్నికల నేపథ్యంలో బిజెపి , జనసేన , టీడీపీ (NDA Alliance) కలిసి కూటమి గా ఏర్పడిన సంగతి తెలిసిందే. మూడు పార్టీలు కలిసి బరిలోకి దిగబోతున్నాయి. దీంతో 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 ఎంపీ స్థానాల్లో కలిసి పోటీ చేస్తున్నాయి. ఇక ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడంతో తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రచారాన్ని మొదలుపెట్టగా..ఈ నెల 30 నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రచారాన్ని మొదలుపెట్టబోతున్నారు. కానీ ఇప్పటివరకు మొత్తం అభ్యర్థులను కూటమి ప్రకటించలేదు. ఇంకా పలు స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పటివరకు 175 స్థానాలకు గానూ 167 మంది అభ్యర్థులను కూటమిప్రకటించింది. టీడీపీ ఐదు స్థానాలు, జనసేన మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ పోటీ చేసే ఆరు నియోజకవర్గాలు చీపురుపల్లి, భీమిలి, దర్శి, అనంతపురం అర్బన్, గుంతకల్లు, ఆలూరు ఇంకా పెండింగ్ లో ఉండగా.. జనసేన పాలకొండ, విశాఖ సౌత్, అవనిగడ్డ స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది. ఈ స్థానాల్లో ఆశావహుల నుంచి పోటీ తీవ్రంగా ఉండటంతో ఆయా పార్టీల అధినేతలకు తలనొప్పిగా మారింది.

ఇక ఈరోజు బిజెపి 10 అసెంబ్లీ స్థానాలను ప్రకటించింది.

* ఎచ్చెర్ల – ఈశ్వరరావు
* విశాఖ నార్త్ – విష్ణుకుమార్ రాజు
* అరకు వ్యాలీ – రాజారావు
*అనపర్తి – శివకృష్ణంరాజు
* కైకలూరు – కామినేని శ్రీనివాస్
* విజయవాడ వెస్ట్ – సుజనా చౌదరి
* బద్వేల్ – బొజ్జ రోశన్న
* జమ్మలమడుగు – ఆదినారాయణరెడ్డి
* ఆదోని – పార్థసారథి
* ధర్మవరం నుంచి వై.సత్యకుమార్ పోటీ చేయబోతున్నారు.

Read Also : 30 Years Prudhvi : పవన్ ను ఓడించేందుకు ఇంటికి లక్ష.. యువతకు బైక్స్ – 30 ఇయర్స్ ఫృథ్వీ