ఆంధ్రప్రదేశ్(AP)లో భూముల వివాదాలు (Land Disputes) ప్రజలకు ఓ పెద్ద తలనొప్పిగా ఉంటాయి. ఏ చిన్న భూ సమస్యకు అయినా రెవెన్యూ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరుగాల్సి వస్తోంది. సమస్య పరిష్కారం కాకుండానే, సంవత్సరాల తరబడి కేసులు లాగితే, తరం తరాలుగా కుటుంబాలు న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్ని ఖర్చులు చేసినా, ఎన్ని సాక్ష్యాలు చూపించినా, ఆ భూమి తమదే అని న్యాయం సకాలంలో దక్కుతుందా అనే అనిశ్చితి ప్రజలను వేధిస్తోంది.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘నక్షా’ (Bhu Naksha) అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని రెవెన్యూ రికార్డులను డిజిటలైజ్ చేయడమే కాకుండా, భూముల పరంగా ఉన్న అస్పష్టతలు తొలగించడమే లక్ష్యం. మంత్రి నారాయణ తెలిపిన ప్రకారం.. ఈ నక్షా కార్యక్రమం దేశవ్యాప్తంగా 152 మున్సిపాలిటీల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించబడింది. ఏపీ లో ప్రస్తుతం 10 మున్సిపాలిటీలను ఎంపిక చేసి, 9.5 లక్షల ఆస్తులపై సర్వే నిర్వహించి, అవి పూర్తిగా డిజిటల్ రికార్డులుగా మార్చున్నట్లు తెలిపారు.
Turkish Aviation Celebi: సెలెబీ ఏవియేషన్ హోల్డింగ్ అంటే ఏమిటి? ఎవరు ప్రారంభించారు?
ఈ డిజిటల్ సర్వే ద్వారా భూమి హక్కులు స్పష్టంగా నమోదు కావడంతో భూ తగాదాలు తలెత్తే అవకాశం లేకుండా చేస్తుంది. ఇప్పటికే 8 మున్సిపాలిటీలలో ఏరియల్ సర్వే పూర్తయిందని మంత్రి నారాయణ తెలిపారు. నక్షా పూర్తిగా అమలులోకి వస్తే, భవిష్యత్తులో భూమి సంబంధిత వివాదాలు తలెత్తకుండా ప్రజలకు సమర్థవంతమైన భూ పరిపాలన అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ఒక రకంగా భూ వివాదాలపై ఎప్పటికీ చెక్ పెట్టే విధంగా ప్రభుత్వ యంత్రాంగం ముందడుగు వేసినట్లు అవుతుంది.