Site icon HashtagU Telugu

CBN : ఏపీ ముస్లింలు..చంద్రబాబుకు షాక్ ఇవ్వబోతున్నారా..?

Muslims Ap Cm Chandrababu

Muslims Ap Cm Chandrababu

రంజాన్ (Ramadan) పవిత్ర మాసంలో ముస్లింలు ఉపవాస దీక్షలతో బిజీగా ఉన్న వేళ, వక్ఫ్ చట్ట సవరణ బిల్లు(The Waqf (Amendment) Bill)పై కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ బిల్లుకు టీడీపీ మద్దతు తెలిపిన నేపథ్యంలో ఆగ్రహంత్వ్ ఉన్న ముస్లింలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Govt)పై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ముస్లింల (Muslims) ఆస్తుల రక్షణకు తీవ్ర ప్రభావం కలిగించే ఈ చట్ట సవరణపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఈ బిల్లుకు మద్దతుగా నిలవడాన్ని రాష్ట్ర ముస్లిం సముదాయాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

RR vs KKR Match: తొలి గెలుపు కోసం.. నేడు కోల్‌క‌తా, రాజ‌స్థాన్ జ‌ట్ల మ‌ధ్య ర‌స‌వ‌త్త‌ర మ్యాచ్‌!

ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముస్లింల కోసం ఏప్రిల్ 27న ఏర్పాటు చేయబోయే ఇఫ్తార్ విందును ముస్లిం సంఘాలు బహిష్కరించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, ఇతర ముస్లిం సంఘాలు ఈ మేరకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇఫ్తార్ విందును ముస్లింలు బహిష్కరించిన ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవగా, అదే తరహాలో ఏపీలోనూ ప్రభుత్వ ఇఫ్తార్ విందును బహిష్కరించాలనే ఆలోచనలో ముస్లిం వర్గాలు ఉన్నాయి.

గత కొన్ని రోజులుగా గుంటూరులో వక్ఫ్ బిల్లుపై పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ముస్లిం సంఘాలు ఏప్రిల్ 29న విజయవాడలో భారీ నిరసన చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ చట్ట సవరణ ముస్లింల ఆస్తులను స్వాధీన పరుచుకునేలా ఉద్దేశించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ బిల్లుకు మద్దతుగా నిలిచిన టీడీపీపై ముస్లింల అసంతృప్తి మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. చూద్దాం మరి ఏంజరుగుతుందో..!