ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పాటైంది. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 164 అసెంబ్లీ, 21 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించి..ఈరోజు నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కృష్ణా జిల్లా గన్నవరం పరిధిలోని కేసరపల్లి (Kesarapalli ) ఐటీ పార్కు వద్ద ఏర్పాటు చేసిన సభ వేదిక ఫై ముందుగా సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసారు. అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , ఆ తర్వాత నారా లోకేష్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేసినట్లు నేతలు వీరే..
అచ్చెన్నాయుడు
కొల్లు రవీంద్ర
పొంగూరి నారాయణ
వంగలపూడి అనిత
నిమ్మల రామానాయుడు
ఫరూక్
ఆనం రామనారాయణరెడ్డి
పయ్యావుల కేశవ్
అనగాని సత్యప్రసాద్
కొలుసు పార్థసారథి
డోలా బాలవీరాంజనేయస్వామి
గొట్టిపాటి రవికుమార్
గుమ్మిడి సంధ్యారాణి
బీసీ జనార్దన్ రెడ్డి
టీజీ భరత్
ఎస్.సవిత
వాసంశెట్టి సుభాష్
కొండపల్లి శ్రీనివాస్
మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
నాదెండ్ల మనోహర్
కందుల దుర్గేశ్
సత్యకుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు.
చంద్రబాబు కేబినెట్ మంత్రుల ఎంపికలో 7/1 ఫార్ములా పాటించారు. అంటే ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవిని కేటాయించారు. ఈ క్రమంలో 133 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీకి 21 మంత్రి పదవులు, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్న జనసేనకు 3 మంత్రి పదవులు(పవన్ డిప్యూటీ సీఎం), 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి 1 మంత్రి పదవి దక్కింది. అది కూడా మొదటిసారి ధర్మవరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సత్య కుమార్ యాదవ్ కు అవకాశం వచ్చింది. అన్ని కులాలకు చంద్రబాబు పెద్దపీఠం వేశారు. అన్ని కులాల వారు సమానమే అని విధంగా అందరికి ఛాన్స్ ఇచ్చారు.
సీనియర్లు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ చంద్రబాబు మంత్రివర్గాన్ని రూపొందించారు. 17 మంది కొత్తవారికి అవకాశం కల్పించగా ముగ్గురు మహిళలకు చోటు లభించింది. ఎనిమిది మంది బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఎస్టీ నుంచి ఒకరికి, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది. నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లకు అవకాశమిచ్చారు.
Read Also : India vs USA: నేడు అమెరికాతో టీమిండియా ఢీ.. వెదర్ రిపోర్ట్ ఇదే..!