Site icon HashtagU Telugu

Photo Exibition: ముంబై ఫొటో ఎగ్జిబిషన్ లో ఏపీ మంత్రి రోజా ఫొటో..!!

Rk Roja

Rk Roja

ఇవాళ అంతర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవం. ఈ సందర్భంగా ఫొటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురేను స్మరించుకుంటున్నాం. కాగా పలు ప్రాంతాల్లో అద్భుతమైన ఫొటోలతో ఎగ్జిబిషన్లు కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ముంబైలో ఇవాళ జరిగిన ఫొటో ఎగ్జిబిషన్లో అద్భుతమైన ఫొటోలుగా 75 ఫొటోలను గుర్తించి ప్రదర్శించారు నిర్వాహకులు.

అయితే ఈ ఎగ్జిబిషన్లో ఏపీ చెందిన ఒక ఫొటో కూడా ప్రదర్శితమైంది. ఆ ఫొటోను ప్రొఫెషనల్ ఫొటో గ్రాఫరే తీసినా…అందులో ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ ప‌తాకాన్ని పట్టుకున్న మంత్రి ఆర్కే రోజా ఉన్నారు. వేదిక చుట్టూ వందలాది మంది ఫొటోగ్రాఫర్లు కెమెరాలతో క్లిక్ మనిపించారు. వేదికపై రోజా ఒక్కరే పతాకాన్ని రెపరెపలాడించారు. ఈ ఫొటో ముంబై ఫొటో ఎగ్జిబిషన్ కు సెలక్ట్ అయినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందంటూ రోజా ట్వీట్ చేశారు.